అత్యాధునిక పరిశోధనలను నిర్వహించడం, డిజిటల్ ఆరోగ్యం , కృత్రిమ మేధస్సులో తదుపరి తరం సాంకేతికతలను అభివృద్ధి చేయడాన్ని ఈ ఐదేళ్ల భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సహకారం ఐఐటీ బాంబే విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవం, కీలకమైన పరిశ్రమ తీరుతెన్ను లను అందిస్తుంది. భవిష్యత్తులో సాంకేతిక సవాళ్లను ఎదుర్కోవటానికి వారిని సిద్ధం చేస్తుంది. ఐఐటీ బాంబే ఫ్యాకల్టీ నేతృత్వంలోని ప్రత్యేక శిక్షణ, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్లు అభివృద్ధి చెందుతున్న సాంకే తికతలపై లోతైన జ్ఞానంతో సామ్సంగ్ ఇంజనీర్లను సన్నద్ధం చేస్తాయి.
గురుగ్రామ్ : సామ్సంగ్ ఆర్ అండ్ డి ఇన్స్టిట్యూట్, నోయిడా (ఎస్ఆర్ఐ – నోయి డా), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (ఐఐటీ బాంబే)తో అవగాహన ఒప్పందంపై సంతకం చేయ డం ద్వారా పరిశ్రమ-విద్యాపరమైన సహకారం కోసం తన నిబద్ధతను బలోపేతం చేసింది.
ఈ అవగాహన ఒప్పందం ప్రకారం ఎస్ఆర్ఐ -నోయిడా, ఐఐటీ బాంబే కృత్రిమ మేధస్సు (ఏఐ), డిజిటల్ ఆరో గ్యం, మరియు ఇతర క్లిష్టమైన రంగాలలో పురోగతిని అన్వేషిస్తాయి. ఐదేళ్ల భాగస్వామ్యం ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులను సులభతరం చేస్తుంది. ఐఐటీ బాంబే విద్యార్థులు, అధ్యాపకులకు సామ్సంగ్ ఇంజనీర్లతో కలిసి పనిచేసే అవకాశాన్ని అందిస్తుంది.
ఈ విధానం విద్యార్థుల కోసం కొత్త మార్గాలను తెరవడమే కాకుండా, వారి పరిశ్రమ సంసిద్ధతను పెంచుతుంది. అంతేగాకుండా ఇది డిజిటల్ హెల్త్ మరియు ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో ఐఐటీ బాంబే నుండి ప్రత్యేక శిక్షణ, ధ్రువీకరణ కార్యక్రమాలతో సామ్సంగ్ ఇంజనీర్లను సన్నద్ధం చేస్తుంది.
ఎంఓయుపై అధికారికంగా ఎస్ఆర్ఐ -నోయిడా మేనేజింగ్ డైరెక్టర్ క్యుంగ్యున్ రూ, ఐఐటీ బాంబే పరిశోధన, అభివృద్ధి అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ ఉపేంద్ర వి. భండార్కర్ సంతకం చేశారు. ఐఐటీ బాంబేలో జరిగిన ఈ కార్యక్రమంలో కోయిటా సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ (కెసిడిహెచ్) అధ్యాపకులు, కెసిడిహెచ్ హెడ్ ప్రొఫెసర్ రంజిత్ పాడిన్హటేరి, ప్రొఫెసర్ నిర్మల్ పంజాబీ, డాక్టర్ రాఘవేంద్రన్ లక్ష్మీనారాయణన్లు పాల్గొన్నారు.
ఎస్ఆర్ఐ -నోయిడా మేనేజింగ్ డైరెక్టర్ క్యుంగ్యున్ రూ మాట్లాడుతూ, ‘‘ఈ సహకారం పరిశ్రమ నైపుణ్యం, అకడ మిక్ ఎక్సలెన్స్ శక్తివంతమైన సమ్మేళనాన్ని సూచిస్తుంది. పరిశోధన, ఆవిష్కరణ, ప్రతిభ అభివృద్ధికి మార్గదర్శ కత్వం కోసం తలుపులు తెరుస్తుంది. మేం ఐఐటీ-బి అసాధారణమైన అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి అర్థ వంతమైన పురోగతిని సాధించడానికి, డిజిటల్ హెల్త్, ఏఐ, ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్క రించే పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఎదురుచూస్తున్నాం. కలిసి, మా సంస్థలు, సమాజం రెండింటికీ ప్రయోజనం చేకూర్చే విజ్ఞాన-భాగస్వామ్య, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను రూపొందిం చాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని అన్నారు.
‘‘ఈరోజు మేం ఎస్ఆర్ఐ -నోయిడాతో మా భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవడం ఒక అద్భుతమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ ఎమ్ఒయు ఆవిష్కరణ, విజ్ఞాన మార్పిడి, శ్రేష్ఠతను సాధించడంలో మా భాగస్వామ్య నిబద్ధతను అందిస్తుంది. కలిసి పని చేయడం ద్వారా, విద్యార్థులు, అధ్యాపకులు పరిశ్రమతో నిమగ్నమవ్వడానికి కొత్త మార్గాలను సృష్టిస్తున్నాం. పరిశోధన అవకాశాలను అభివృద్ధి చేస్తున్నాం. మన కమ్యూనిటీల అభివృద్ధికి తోడ్ప డుతున్నాం ”అని ఐఐటీ బాంబే అసోసియేట్ డీన్ (R&D) ప్రొఫెసర్ ఉపేంద్ర వి. భండార్కర్ అన్నారు.
ఈ అవగాహన ఒప్పందం ఉమ్మడి పరిశోధన పత్రాల ప్రచురణను ప్రోత్సహిస్తుంది. సాంకేతిక పురోగతి, పరిశ్రమ-అనుగుణ్య మైన ఆవిష్కరణలను నడిపించే జ్ఞాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా, సామ్సంగ్, ఐఐటీ బాంబే తదుపరి తరం సాంకేతికతల సరిహద్దులను అధిగమించే భవిష్యత్ పురోగతులను ప్రేరేపించే నైపుణ్యం యొక్క సుస్థిరమైన మార్పిడికి పునాదిని ఏర్పాటు చేస్తున్నాయి.