మిథికల్‌ థ్రిల్లర్‌గా నాగచైతన్య కొత్త సినిమా

Naga chaitanya

టాలీవుడ్ నటుడు నాగ చైతన్య మరోసారి కొత్తదనం కోసం సిద్ధమయ్యాడు. ఇప్పటి వరకు తన సినీ ప్రయాణంలో ఊహించని ఓ విభిన్న జానర్‌లో ప్రయోగం చేయబోతున్నాడు. ఈసారి ఆయన మిథికల్ థ్రిల్లర్ స్థాయిలో ఓ భారీ బడ్జెట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి దర్శకుడు కార్తీక్ దండు, గతంలో సాయి ధర్మ తేజ్, సంయుక్త మీనన్‌లతో విరూపాక్ష వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన దర్శకుడిగా గుర్తింపు పొందాడు.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ప్రధాన నిర్మాతగా వ్యవహరించగా, సుకుమార్ సహనిర్మాతగా ఈ ప్రాజెక్టుకు తన మద్దతు అందిస్తున్నారు. నవంబర్ చివరి లేదా డిసెంబర్ మొదటివారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

శనివారం, నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఇందులో, రాక్ క్లైంబింగ్ టూల్స్‌తో ఓ పర్వతంపై నిలబడి ఉన్న నాగ చైతన్య శక్తివంతమైన నేత్రాన్ని చూస్తున్నట్లు కనిపించడంతో సినిమా విషయంలో ప్రేక్షకుల్లో కొత్త ఉత్సుకత కలిగింది. నాగ చైతన్య కెరీర్‌లో 24వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌కు ఎన్‌సీ 24 అనే వర్కింగ్ టైటిల్‌ను నిర్ణయించారు. భారీ బడ్జెట్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో విజువల్స్‌ను అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రముఖ సాంకేతిక నిపుణులను అంకితం చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

కాంతార, విరూపాక్ష సినిమాలతో సంగీత ప్రియుల అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఫోటోగ్రఫీ బాధ్యతలు శ్యామ్ దత్ భుజాన వేసుకోగా, ఎడిటింగ్ బాధ్యతలు నవీన్ నూలి నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడిగా శ్రీ నాగేంద్ర పని చేస్తుండగా, చిత్రంలో ఇతర కీలక పాత్రల వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఈ చిత్రం గ్రాఫిక్స్‌తో అద్భుతమైన విజువల్ అనుభూతిని అందిస్తుందని, మిథికల్ థ్రిల్లర్‌గా ఉండబోతున్న ఈ ప్రయాణం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవాన్ని కలిగిస్తుందని మేకర్స్ తెలిపారు. టాలీవుడ్‌లో మరోసారి నాగ చైతన్య తనదైన మార్కును నిలబెట్టుకునే అవకాశం ఈ సినిమాతో రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Peace : a lesson from greek mythology omniscopelife. There is no timeline for the chapter 11 bankruptcy, the albany diocese said in a statement. Copyright © 2017 usa business yp.