State wide auto strike on December 7

డిసెంబర్‌ 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్‌

హైదరాబాద్‌: ఆటో డ్రైవర్ల తమ డిమాండ్ల సాధనకు వచ్చే నెల 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్‌ చేపట్టనున్నారు. బంద్‌తో పాటు హైదరాబాద్‌లో లక్ష మందితో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆటోడ్రైవర్స్‌ యూనియన్‌ జేఏసీ వెల్లడించింది. ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో జేఏసీ రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆటోడ్రైవర్ల సమస్యలను పరిష్కరించకుండా మోసం చేసిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు.

ఇక, కాంగ్రెస్‌ పార్టీ డ్రైవర్ల ఆందోళనలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బీఆర్‌ఎస్‌ లాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హైదరాబాద్‌లో కొత్తగా 20 వేల ఆటో పర్మిట్‌లు జారీ చేయాలని.. ఆటోలకు థర్డ్ పార్టీ బీమా అమలు చేయాలని.. ప్రమాద బీమా కవరేజీని రూ.10 లక్షలకు పెంచాలని యూనియన్ డిమాండ్ చేస్తోంది. అదనంగా ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి తక్షణమే 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని వారు పిలుపునిచ్చారు.

కాగా, ఆటోకార్మికులకు ప్రభుత్వం నెలకు రూ.15వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం సంవత్సర సంబురాలు చేసుకుంటున్నదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశం, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్‌, ఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌, హైదరాబాద్‌ ఓనర్‌ అసోసియేషన్స్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు సలీం, టీఏడీయూ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Innovative pi network lösungen. 500 dkk pr. Actor jack black has canceled his band’s concert tour after his bandmate made a.