Headlines
mlc naveen

పెను ప్రమాదం నుండి బయటపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ

పెను ప్రమాదం నుండి బయటపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ

ఇటీవల రోడ్డు ప్రమాదాలు అనేవి అనేకం అవుతున్నాయి. ఇంట్లో నుండి బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి చేరుకునేవరకు కుటుంబ సబ్యులకు టెన్షనే. అతివేగం , మద్యంమత్తు , నిద్ర మత్తులో డ్రైవ్ చేయడం, నిర్లక్ష్యపు డ్రైవ్ , రోడ్లు బాగాలేకపోవడం , టైర్లు పేలిపోవడం, బ్రేకులు ఫెయిల్ అవ్వడం ఇలా అనేక కారణాలతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల వల్ల అమాయకపు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ప్రతి రోజు ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ న‌వీన్ కుమార్ రెడ్డికి భారీ ప్ర‌మాదం త‌ప్పింది. రోడ్డు ప్ర‌మాదం నుంచి సుర‌క్షితంగా బయటపడడంతో పార్టీ శ్రేణులు, కుటుంబ స‌భ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

న‌వీన్ కుమార్ రెడ్డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నుంచి హైద‌రాబాద్‌కు గురువారం మ‌ధ్యాహ్నం బ‌య‌ల్దేరారు. అయితే త‌న కారు బెంగళూరు హైవేపై వ‌స్తుండ‌గా షాద్‌న‌గ‌ర్ మిలినీయం టౌన్ షిప్ వ‌ద్ద స‌డెన్‌గా ఓ బైక్ అడ్డుగా వ‌చ్చింది. దీంతో ఎమ్మెల్సీ కారు డ్రైవ‌ర్ స‌డెన్‌గా బ్రేక్ వేయ‌డంతో.. బైక్‌పై ఉన్న వ్య‌క్తికి గాయాల‌య్యాయి. ఎమ్మెల్సీ న‌వీన్ కుమార్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. ఇక గాయ‌ప‌డిన వ్య‌క్తిని త‌న కారులోనే ఎమ్మెల్సీ న‌వీన్ స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాల‌ని వైద్యుల‌ను ఎమ్మెల్సీ ఆదేశించారు. ఈ ప్ర‌మాదంలో న‌వీన్ కుమార్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు, పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.

నవీన్ రెడ్డి రాజకీయ రంగం విషయానికి వస్తే.. 2024లో జరిగిన మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఉప ఎన్నిక నుండి తెలంగాణా శాసన మండలి ఎన్నికలలో ఆయన MLC గా ఎన్నికయ్యారు. నవీన్ కుమార్ రెడ్డి తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రారంభించి కొత్తూరు Zptc గా గెలుపొందారు. ఆ తర్వాత 2014 నుండి 2019 వరకు మహబూబ్ నగర్ జిల్లా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షునిగా పనిచేసి అనంతరం బిఆర్ఎస్ లో చేరారు. భారత ఎన్నికల సంఘం (ECI) 26 ఫిబ్రవరి 2024న తెలంగాణ శాసన మండలిలో ఖాళీగా ఉన్న మహబూబ్‌నగర్ స్థానిక అధికారుల నియోజకవర్గ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సిట్టింగ్ సభ్యుడు కసిరెడ్డి నారాయణరెడ్డి తన రాజీనామాను 8 డిసెంబర్ 2023న సమర్పించినందున ఎన్నిక అనివార్యమైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు . మార్చి 28న జరిగిన ఉప ఎన్నికకు భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అభ్యర్థిగా ఎన్. నవీన్ కుమార్ రెడ్డిని ప్రతిపాదించింది.

తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా నవీన్ కుమార్ రెడ్డి 109 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు , ఇందులో అతను 762 ఓట్లు సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థి ఎం జీవన్ రెడ్డికి 653 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థికి ఒక ఓటు లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *