సీఎం రేవంత్ పై ఎర్రబెల్లి ఫైర్

మాజీ మంత్రి , పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు పై సీఎం రేవంత్ వరంగల్ సభలో ఘాటైన వ్యాఖ్యలు చేయడంపై ఆయన రియాక్ట్ అయ్యారు. నన్ను రాక్షసుడని రేవంత్ రెడ్డి విమర్శించారని.. నేను రాక్షసుడినే అని..ప్రజల కోసం ఎంతవరకైనా తెగిస్తానని ఎర్రబెల్లి ఘాటుగా స్పందించింది. నేను సొంత జిల్లాలో ఏడుసార్లు గెలిచానని.. నువ్వు గెలిచినచోట మళ్లీ గెలవని వాడివని ఎద్దేవా చేశారు. నా జిల్లాలో నేను గెలిచినా..నీవు నీ జిల్లాలో ప్రజలు తరిమితే రంగారెడ్డి జిల్లా వాసులకు మయామాటలు చెప్పి గెలిచినవ్ అంటూ మండిపడ్డారు. తెలంగాణలో వరుసగా ఏడుసార్లు గెలిచింది కేసీఆర్ తర్వాత నేను ఒక్కడినే అని గుర్తు పెట్టుకోవాలన్నారు.

ఓచోట ఓడితే మరోచోటకు వలసపోయే నువ్వు.. నన్ను విమర్శిస్తావా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లపై రేవంత్ రెడ్డి పిచ్చిపిచ్చిగా విమర్శలు చేస్తున్నాడని, వారు ఏనాడు కూడా ప్రజా తిరస్కారానికి గురై ఎన్నికల్లో ఓడలేదన్న సంగతి మరువరాదన్నారు. ఓటమి లేని కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావులపై పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా లేని నీవు తెలంగాణ కోసం నీతులు చెబుతున్నావన్నారు. కాళోజీని ఎన్నడు కలవని రేవంత్ రెడ్డి పిచ్చి మాటలు మాట్లాడవద్దన్నారు. బాబ్లీ కోసం ఆందోళన చేసినప్పుడు లాఠీచార్జీ చేస్తే పారిపోయి వచ్చాడన్నారు. ఏడాదిలో అసలు నీవు ఏమి చేశావో కొత్తగా జనాలకు చెప్పలేదన్నారు. అన్ని కేసీఆర్ చేసినవేనన్నారు. మహిళా సదస్సు పెట్టి వారికి కోటీశ్వరులను చేస్తానని కొత్తగా చేసిందేమి లేదన్నారు. తన బంధువులను కోటీశ్వరులను చేసేందుకే అధికారాన్ని వాడుకుంటున్నాడని ఎర్రబెల్లి ఆరోపించారు.

వస్త్ర పరిశ్రమ, పండ్ల రసం పరిశ్రమ పెట్టింది ఇక్కడే బీఆర్ఎస్ హయాంలోనేనన్నారు. బతుకమ్మ చీరలు ఇవ్వలేదని, నెలకు 2500ఇస్తా అని, తులం బంగారమని ఇవ్వలేదన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ లో ఎన్ని అమలు చేశావో రేవంత్ రెడ్ది ముందుగా చెప్పాలన్నారు. రేవంత్ వచ్చాకా వరంగల్ లో ఉన్న కంపెనీలు వెళ్లిపోతున్నాయన్నారు. కాళోజి కళా భవనాన్ని కేసీఆర్ కట్టిస్తే దాన్ని ప్రారంభించి నేనే కట్టించినా అని చెప్పుకుంటున్నాడని విమర్శించారు.

ధర్మసాగర్ నుంచి నీళ్లు తెచ్చే పనులు చేయించాలన్నారు. కేంద్రం నుంచి కోచ్ ఫ్యాక్టరీ తెస్తమని తేలేదని దాన్ని తీసుకరావాలన్నారు. కేసీఆర్ మొక్కను మళ్లీ మొలవనివ్వమంటున్నాడని, ఎవరిని మొలవనివ్వమో చూద్ధామన్నారు. నీవు రియల్ ఎస్టేట్ బ్రోకర్, దొంగ అని ఎర్రబెల్లి మండిపడ్డారు.

కేసీఆర్ (KCR) తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడిని , మళ్లీ గడ్డమీద కేసీఆర్ మొక్కను మొలవనివ్వనని, రాహుల్​ గాంధీని చూసి కేసీఆర్​ బుద్ధి తెచ్చుకోవాలి. ఒక్కసారి ఓడిస్తే.. మళ్లీ ప్రజల మొహం చూడవా? అధికారం ఇస్తే దోచుకోవటం.. ఓడిస్తే ఫామ్​హౌజ్​లో దాచుకోవటం. ప్రజల మీద ప్రేమ ఉంటే ఎందుకు ప్రజల మధ్యకు రావటం లేదు. నిజంగా ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ల మధ్యకు వచ్చి ఎందుకు అడగటం లేదు. మూడుసార్లు అధికారం దక్కపోయినా.. రాహుల్​ గాంధీ ప్రజల మధ్యే ఉన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజల కోసం సూచనలు ఎందుకు చేయట్లేదు అంటూ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయోత్సవ సభ ను వరంగల్ లో ఏర్పాటు చేసింది. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి , మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు ఇలా కాంగ్రెస్ నేతలంతా హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

??. Free buyer traffic app. New 2025 forest river sanibel 3902mbwb for sale in monroe wa 98272 at monroe wa sn152.