water in the papikondala to

పాపికొండల పర్యాటకులకు పెను ప్రమాదం తప్పింది

పాపికొండల పర్యాటకులకు పెను ప్రమాదం తప్పడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. పాపికొండలు నదీ విహారయాత్ర చాల రోజుల తర్వాత ప్రారంభమైంది. నాలుగు నెలల తర్వాత పర్యాటకులకు అనుమతి ఇవ్వడంతో గండిపోచమ్మ నుండి పేరంటాలపల్లి వరకు బోట్లు నడుస్తున్నాయి. 15 బోట్లకు అనుమతులు లభించాయి. భద్రతకు ప్రాధాన్యతనిస్తూ లైఫ్ జాకెట్లు, తనిఖీలు కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రమాద నివారణకు మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించారు. పర్యాటకులు సురక్షితంగా విహారయాత్ర చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఆదివారం గోదావరి నదిపై పర్యాటకులతో పాపికొండల విహారయాత్రను ముగించుకుని తిరిగి వస్తున్న ఓ బోటులోకి నీరు చేరిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఆలయం నుంచి ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులతో పాపికొండల విహారయాత్రకు బోట్లు వెళ్లాయి.

విహారయాత్రను ముగించుకుని తిరిగి వస్తున్న ఓ బోటు బచ్చలూరు- మంటూరు మధ్యకు వచ్చే సరికి గోదావరి నదిలో నుంచి బోటు ఇంజిన్ లోని నీటిని తోడి, కూలింగ్ చేసి బయటకు పంపించే పైపు (కూలింగ్ పైపు) పగిలిపోవడంతో బోటులోకి కొంతమేర నీరు చేరింది. దీంతో బోటులో ఉన్నవారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై అక్కడి సమీప దూరానికి బోటును సురక్షితంగా చేర్చారు. బోటులోకి చేరిన నీటిని బయటకు పంపించిన అనంతరం పర్యాటకులను పోశమ్మగండికి తీసుకొచ్చారు. ఈ ఘటనపై బోటు నిర్వాహకులు తమకు సమాచారం అందించారని కంట్రోల్ రూం అధికారి ఒకరు తెలిపారు. బోటు నిర్వాహకులు అప్రమత్తమవ్వడంతో పర్యాటకులకు ప్రమాదం తప్పింది. లేదంటే పర్యాటకుల ప్రాణాలు నీటిలో కలిసిపోయేయి.

ఇక పాపికొండల యాత్ర విషయానికి వస్తే …పాపికొండల విహారయాత్ర ప్రకృతి అందాలు ఆస్వాదించేందుకు ఎంతో చక్కటి యాత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నదీ తీరంలో ఉన్న పాపికొండలు, ప్రకృతి ప్రేమికులకు మరియు ఫోటోగ్రఫీ అభిరుచిగలవారికి చక్కటి అవకాశం. ఈ ప్రాంతం నది, అడవులు, కొండలు కలగలసి ఉండటం వల్ల అందమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయొచ్చు. రాజమండ్రి నుండి భద్రాచలం వరకు బోటు ప్రయాణం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. పెద్దవారు , చిన్నవారు చాల ఎంజాయ్ చేయొచ్చు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఖమ్మం. ఈ కొండల నడుమ గోదావరి ప్రవహించటం జరుగుతుంది. బోటు రైడ్‌లలో మధురమైన సంగీతం, భోజనాలు అందిస్తూ పర్యాటకులను ఆకట్టుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Kejar pertumbuhan ekonomi 8 persen, bp batam prioritaskan pengembangan kawasan strategis. But іѕ іt juѕt an асt ?. Latest sport news.