హోంమంత్రి నోట క్షేమపణలు

నిండు అసెంబ్లీ లో ఏపీ హోంమంత్రి అనిత క్షేమపణలు కోరింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా నడుస్తున్న సంగతి తెలిసిందే. అధికార కూటమి , వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మాటకు మాట , విమర్శకు ప్రతివిమర్శ ఇలా గందగోళంగా నడుస్తూ వస్తుంది.

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, మండలి సభలో రాష్ట్ర హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. హోంమంత్రి వంగలపూడి అనితరాజకీయాలు మాట్లాడుతున్నారని, శాంతి భద్రతలపై సూటిగా సమాధానం చెప్పడం లేదని , రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రస్తావించారని బొత్స అన్నారు. రాజకీయం చేయాలనే ఉద్దేశంతో కాకుండా హోంమంత్రి అనిత తాము అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలని, లేని పక్షంలో తాము సభ నుంచి వాకౌట్ అవుతామని హెచ్చరించారు.

దీంతో బొత్స వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ బొత్సకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వాళ్లు చేసిన దౌర్భాగ్యాలు, వాస్తవాలు సభలో వినే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా దమ్ముంటే బొత్స నిల్చోవాలని, ఆయన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానని ఆమె వ్యాఖ్యానించారు. సభలో అనిత చేసిన వ్యాఖ్యలపై శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితపై శాసనమండలి చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దమ్ము, ధైర్యం అని మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు హోంమంత్రి అనిత వెంటనే క్షమించాలని వేడుకోవడంతో చైర్మన్ శాంతించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *