pushpa 2 trailer records

100 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసిన ‘పుష్ప-2’ ట్రైలర్

‘పుష్ప-2’ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్స్ వ్యూస్ తో రికార్డ్స్ సృష్టిస్తుంది. అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో తెరకెక్కిన పుష్ప 2 డిసెంబర్ 05 న పాన్ ఇండియా గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ పై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడం తో మేకర్స్ ప్రమోషన్ కార్య క్రమాలు స్పీడ్ చేశారు. నిన్న ఆదివారం ఈ మూవీ ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని పాట్నా లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక , పలువురు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ వేడుక భారీ సక్సెస్ కావడమే కాదు అల్లు అర్జున్ రేంజ్ ఏంటో నేషనల్ మొత్తం మాట్లాడుకునేలా చేసింది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే..మాటల్లో చెప్పలేం..పుష్ప రేంజ్ ఏంటో సినిమాలో చూడాలసిందే అని అనుకునేలా కట్ చేసారు. పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ , పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్ నేషనల్ అంటూ బన్నీ చెపుతున్న ఒక్కో డైలాగ్ కు వెట్రుకలు నిక్కబొడుతున్నాయి. ఈ ట్రైలర్ చూసిన అభిమానులు , సినీ ప్రముఖులు తమ స్పందనను తెలియజేస్తూ వస్తున్నారు. దీంతో యూట్యూబ్ లో ట్రైలర్ రికార్డు వ్యూస్ నెలకొల్పుతుంది. ఇప్పటికే పలు రికార్డ్స్ బ్రేక్ చేయగా…తాజాగా మరో రికార్డు నెలకొల్పింది.

యూట్యూబ్ లో అత్యంత వేగంగా 100 మిలియన్ల వ్యూస్ సాధించిన ట్రైలర్ గా పుష్ప 2 ట్రైలర్ నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం యూట్యూబ్లో నంబర్ 1లో ట్రెండ్ అవుతోందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మహేశ్‌ బాబు , ప్రభాస్‌ సినిమాల ట్రైలర్స్‌ వ్యూస్‌ పరంగా టాప్‌లో ఉన్నాయి. ఇప్పుడు వాటిని అల్లు అర్జున్‌ తక్కువ సమయంలోనే దాటేశాడు. సరికొత్త చరిత్ర సృష్టించాడు. తెలుగులో ఇప్పటి వరకు ట్రైలర్లలో 24 గంటలలో ఎక్కువ మంది చూసింది మహేశ్‌బాబు హీరోగా నటించిన గుంటూరు కారం. దీనికి 37.68 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. తర్వాతి ప్లేస్‌లో ప్రభాస్‌ హీరోగా వచ్చిన సలార్‌ నిలిచింది. సలార్‌ సినిమా ట్రైలర్‌కు 24 గంటలలో 32.58 మిలియన్ వ్యూస్‌ వచ్చాయి. ఇప్పుడు గుంటూరు కారం, సలార్‌ సినిమాలను కేవలం 15 గంటల్లో అల్లు అర్జున్ దాటేశాడు. మరి ముందు ముందు ఇంకెన్ని రికార్డ్స్ సృష్టిస్తారో బన్నీ చూడాలి.

Pushpa Jhukega nahin…
Aur record pe record banana rukega nahin..💥💥

The #RecordBreakingPushpa2TRAILER is the fastest Indian Trailer to hit 100 MILLION+ VIEWS ❤️‍🔥#Pushpa2TheRuleTrailer
▶️ https://t.co/O9iK3r5TkJ#Pushpa2TheRule#Pushpa2TheRuleOnDec5th

Icon Star @alluarjunpic.twitter.com/Yr4tVViRBo— Mythri Movie Makers (@MythriOfficial) November 18, 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bahas 2 agenda penting, pjs wali kota batam hadiri rapat paripurna dprd kota batam. Whаt wіll іt tаkе tо turn the tіdе ?. Latest sport news.