rajamouli mahesh babu

మహేశ్ బాబును ఎలాంటి కొత్త లుక్ లో చూపిస్తాడో రాజమౌళి

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం తన అభిమానులకు కొత్త ఆశలు నింపుతూ, దర్శక దిగ్గజం రాజమౌళి సినిమాకు సిద్దమవుతున్నారు. మహేశ్ బాబు నటనలో మాత్రమే కాకుండా, లుక్ విషయంలో కూడా పెద్ద మార్పులు చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. ఇది అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. గత కొన్ని నెలలుగా మహేశ్ బాబు లుక్‌పై జరుగుతున్న చర్చలు తెగ హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటివరకు గడ్డంతో మహేశ్ కనిపించలేదు, కానీ ఈసారి అభిమానులు అతన్ని సరికొత్త లుక్‌లో చూడబోతున్నారు. గుంటూరు కారం సినిమాకు గడ్డం లైట్‌గా పెంచినా, రాజమౌళి సినిమా కోసం పూర్తిగా గడ్డంతో కనిపించనున్నారు అనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అతను ఇటీవల వరకు పొడవాటి జుట్టుతో, గడ్డంతో ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో, ఈ వార్తలకు బలం చేకూరింది.అయితే, మహేశ్ లేటెస్ట్ లుక్ చూసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవల కీరవాణి కుమారుడి ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో మహేశ్ తన గడ్డం ట్రిమ్ చేసుకుని స్మార్ట్‌గా మెరిసిపోతూ కనిపించారు.

ఈ కొత్త లుక్ చూసిన అభిమానులు, మహేశ్ జక్కన్న సినిమా కోసం గడ్డంతో కనిపించడేమో అన్న ప్రచారాలను ప్రశ్నిస్తున్నారు. రాజమౌళి సినిమా కోసం ప్రత్యేకంగా గడ్డం పెంచుతాడనే వార్తలు ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారాయి.రాజమౌళి సినిమాలంటే పెద్ద స్కేల్, కొత్త ప్రయత్నాలు అనేవి తప్పనిసరి. మహేశ్ బాబు కూడా దర్శకుడి సూచనల ప్రకారం నిత్యం కొత్త లుక్స్‌ను ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది, అందుకే మహేశ్ బాబుకు అప్పటివరకు పలు లుక్స్ మార్చమని రాజమౌళి సూచించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

అసలు సినిమా కథ, మహేశ్ పాత్రకు తగినట్టుగా ఒక లుక్‌ను ఎంపిక చేసే వరకు జక్కన్న సైలెంట్‌గా ఉండే అవకాశం ఉంది. మహేశ్ బాబు లుక్‌లో చేసే మార్పుల కారణంగా సినిమా పై మరింత హైప్ క్రియేట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.మహేశ్ బాబు లుక్స్‌పై జరుగుతున్న ఈ ప్రచారంతో, ఆయన అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఏ సినిమాకూ తాను గడ్డం పెట్టుకోని మహేశ్ బాబు, జక్కన్న సినిమాకు ఇది సవాలుగా తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమా ద్వారా మహేశ్ బాబు కొత్త యాంగిల్‌లో కనిపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. మరి, జక్కన్న విజన్‌లో మహేశ్ బాబు ఎలాంటి లుక్‌లో కనువిందు చేస్తారో వేచి చూడాలి. రాజమౌళి నమ్మకానికి తగినట్టుగా మహేశ్ తన మాస్ అప్పీల్‌తో మరోసారి మాయ చేయడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Innovative pi network lösungen. Sikkerhed for både dig og dine heste. Actor jack black has canceled his band’s concert tour after his bandmate made a.