ktr fires on cm revanth reddy delhi tours

నేడు ఢిల్లీకి వెళ్లనున్న కేటీఆర్‌

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేడు దేశరాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. లగచర్ల దారుణాలను జాతీయ మీడియా ముందు చూపించనున్న కేటీఆర్.. కొడంగల్ లగచర్ల బాధితుల కోసం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవితతో కలిసి కేటిఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఫార్మా విలేజ్ పేరుతో రేవంత్ సర్కార్ బలవంతపు భూసేకరణ చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపణలు చేయనుంది.

గిరిజనులు, దళితులు, ఓబీలపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోందంటోన్న కేటీఆర్‌… ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ కాన్‌స్టిట్యూషన్ క్లబ్ లో ప్రెస్‌మీట్‌ కూడా పెట్టనున్నారు. ఇక అటు నేడు లగచర్లలో జాతీయ ఎస్టీ కమిషన్ బృందం పర్యటించనుంది. ఈ సందర్భంగా గిరిజనులపై దాడిన దాడి వివరాలను తెలుసుకోనుంది జాతీయ ఎస్టీ కమిషన్. లగచర్ల నుంచి సంగారెడ్డి జైలుకు వెళ్లి రైతులతో ముఖాముఖిలో కూడా పాల్గొననుంది జాతీయ ఎస్టీ కమిషన్..

ఇకపోతే..తెలంగాణలో గిరిజన బిడ్డలపై జరిగిన, జరుగుతున్న దాష్టీకంపై జాతీయ మీడియా కూడా స్పందించాలని లగచర్ల బాధితులు వేడుకుంటున్నారు. పథకం ప్రకారం కరెంటు తీసి, అర్ధరాత్రి ఇండ్లలోకి చొరబడి, ఆడబిడ్డలను అసభ్యంగా తాకుతూ, పడుకున్నవారిని కూడా అట్లాగే పోలీస్‌ స్టేషన్లకు తరలించిన తీరుపై ప్రత్యేక కథనాలు రాయాలని కోరుతున్నారు. ‘కొండగల్‌లో జరిగిన అరాచకాలను, ఆగడాలను వెలికితీయాలని కన్నీటి పర్యంతమవుతున్నారు. అధికారులపై తిరగబడిన కాంగ్రెస్‌, బీజేపీ సానుభూతి పరులైన కొందరు రైతులను తప్పించి, ఆ ఘటనతో సంబంధం లేని రైతులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన ఉదంతాలను, తమ పోరాటాన్ని జాతీయస్థాయిలో వెలుగులోకి తేవాలని ప్రాధేయపడుతున్నారు. ‘ఏ ఇంట్ల చూసినా ఆర్తనాదాలే విపిస్తున్నయి. వాటిని ఢిల్లీ స్థాయిల చూపించండి సారూ.. మీ బాంచెన్‌’ అంటూ జ్యోతి అనే నిండు చూలాలు చేతులెత్తి ఢిల్లీకి వెళ్లి జాతీయ మీడియాను వేడుకుంటున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Dprd kota batam. Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Latest sport news.