న్యూఢిల్లీ: ఢిల్లీలో చలితో పాటు వాయు కాలుష్యం కూడా పెరుగుతోంది. దీంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) తీవ్రమైన కేటగిరీకి చేరుకుంది. దీనికి సంబంధించి సోమవారం నుంచి ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో GRAP స్టేజ్-4 ఆంక్షలు అమలులోకి రానున్నాయి. అంతేకాక.. ఢిల్లీ ప్రభుత్వం 10-12 మినహా అన్ని పాఠశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 450 దాటింది. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం పిల్లల చదువులపైనా ప్రభావం చూపుతోంది. పెద్ద వాహనాల రాకపోకలను నిషేధిస్తూ ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో సబ్‌కమిటీ GRAP-4 ఆంక్షలు విధించింది. జీఆర్‌పీఏ-4 అమల్లోకి వచ్చిన తర్వాత సీఎం అతిషి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు.
ఢిల్లీలో GRAP-4 అమలుతో నవంబర్ 18 నుండి 10, 12 తరగతులు మినహా అన్ని విద్యార్థులకు శారీరక తరగతులు నిలిపివేయబడతాయని ముఖ్యమంత్రి అతిశి తెలిపారు. 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులు మాత్రమే పాఠశాలకు వెళ్లగా, ఇతర తరగతుల విద్యార్థులు ఆన్‌లైన్‌లో చదువుతారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్ని పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే 1 నుంచి ఐదో తరగతి వరకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని సూచించగా.. తాజాగా 6 నుంచి 9, 11తరగతుల విద్యార్థులకు వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం ఆతిశీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు అలాగే దీూ-×V లేదా అంతకంటే తక్కువ వాహనాలు, హెవీ గూడ్స్ వెహికల్స్ పై నిషేధం విధించారు. అత్యవసర సేవా వాహనాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. విమానాల్లో ప్రయాణించే వారికి ట్రావెల్ అడ్వైజరీ కీలక సూచనలు చేసింది. కొన్ని విమానాలు ఆలస్యం కావచ్చునని, ప్రయాణికులు గమనించాలని పేర్కొంది.