ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, పలు సార్లు వివాదాలకు గురైన వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ఇంటర్నెట్‌లో సంచలనాన్ని సృష్టించారు.. ముంబైలో నవంబర్ 14, 2024 న జరిగిన సీబీఎన్‌సీ-టీవీ18 గ్లోబల్ లీడర్షిప్ సమిట్‌లో ఆయన 70 గంటల వర్క్ వీక్‌కు మద్దతు తెలియజేస్తూ. “యువత 70 గంటల పని చేయాలి” అని మూర్తి పేర్కొన్నారు, ఇది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
మూర్తి తన వ్యాఖ్యలలో “నేను వర్క్-లైఫ్ బ్యాలెన్స్ నమ్మను” అని స్పష్టం చేశారు .ఆయన అభిప్రాయం ప్రకారం, విజయానికి కావలసినది కష్టపడి పనిచేయడం, ఎక్కువ గంటలు పని చేయడం మాత్రమే అని చెప్పారు.70 గంటల వర్క్ వీక్‌కి మద్దతు ఇచ్చే మూర్తి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి కూడా ప్రశంసలు చేశారు. మోదీ వారంలో సుమారు 100 గంటల వరకు పని చేస్తారని, అది చాలా ప్రసంశనీయమైన విషయం అని మూర్తి చెప్పారు.
ఈ విధమైన వ్యాఖ్యలు మొదట 2023 నవంబరులో మూర్తి చేసినప్పుడు కూడా పెద్ద చర్చలు జరిగినవి. ఆయన 1986లో భారతదేశం ఆరు రోజుల పని వారాన్ని వీడుకొని ఐదు రోజుల పని వారానికి మారినది తనకు నిరాశను కలిగించిందని చెప్పారు. మూర్తి ప్రకారం, ఇది దేశం ఆర్థిక వ్యవస్థకు అనుకూలం కాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
మూర్తి వ్యాఖ్యలు ఇప్పుడు పెద్దగా చర్చించబడుతున్నాయి, ముఖ్యంగా వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై ఉన్న విభిన్న అభిప్రాయాలతో. పలు యువత ప్రముఖులు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ప్రాముఖ్యతను వర్ణిస్తూ మూర్తి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు. అయితే, మూర్తి తన అభిప్రాయాన్ని మళ్లీ స్పష్టం చేస్తూ, దీన్ని మార్పిడి చేయబోమని తెలిపారు.ఇక, ఈ వివాదం ఉద్యోగుల ఆరోగ్యంపై, కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగాల నిర్వహణపై కూడా చర్చలకు దారితీస్తోంది.