Naga Chaitanya 2

నాగచైతన్య శోభితల వెడ్డింగ్ కార్డ్ లీక్

టాలీవుడ్ అగ్రనటుడు అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య, నటీమణి శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం జరిపిన సంగతి సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి ప్రేమాయణం గురించి కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నా, నిశ్చితార్థంతో ఆ ఊహాగానాలకు ముగింపు పలికారు. ఇప్పుడు వీరి పెళ్లి తేదీ, చోటు, వేడుకల వివరాలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.మంతతో విడాకుల తరువాత నాగచైతన్య ఒంటరిగా గడిపిన కాలం ముగియడంతో అక్కినేని అభిమానులు కొత్త ఆనందంలో మునిగిపోయారు. పెళ్లి ఏర్పాట్లను రెండు కుటుంబాలు చాలా గోప్యంగా నిర్వహిస్తున్నాయి.

ఇదే సమయంలో, శోభిత ఇంట్లో పసుపు కార్యక్రమాలు ప్రారంభమైన ఫోటోలు ఆమె సోషల్ మీడియాలో పంచుకోవడం వివాహ సమీపించిందనే సంకేతాన్ని ఇచ్చింది.అవార్డుల వేడుకలో కూడా శోభిత నాగార్జునతో కలసి మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖులకు పరిచయం కావడం విశేషం. కుటుంబ సమూహ ఫోటోలలో శోభిత ప్రత్యేకంగా నిలిచారు. పెళ్లి ఏర్పాట్లు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగే అవకాశమున్నట్లు సమాచారం. డిసెంబర్ 2న సంగీత్, 3న మెహందీ, 4న వివాహం, 10న గ్రాండ్ రిసెప్షన్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది.వెడ్డింగ్ కార్డ్ డిజైన్, బహుమతుల డిటైల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగచైతన్య తల్లిదండ్రుల పేర్లతో పాటు అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల పెద్దల పేర్లు కార్డులో పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. ఈ వార్తల నిజానిజాలు తెలుసుకోవాలంటే కొద్దికాలం వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Kejar pertumbuhan ekonomi 8 persen, bp batam prioritaskan pengembangan kawasan strategis. The easy diy power plan uses the. Latest sport news.