చైనాలో యువకుల ఉన్మాద చర్యలు

maniac knife attack in chin

చైనాలో ఉన్మాద ఘటనలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్న ఈ ఘటనల వెనుక వ్యక్తిగత సమస్యలు, సామాజిక ఒత్తిళ్లు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

తాజాగా తూర్పు నగరమైన వుషీలో 21 ఏళ్ల యువకుడు కళాశాల క్యాంపస్‌లో విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడం తో 8 మంది ప్రాణాలు కోల్పోగా 17 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన అందర్నీ తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఈ ఘటనకు కారణం అతని విద్యా సంబంధిత సమస్యలు,ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వుషీ వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీ విద్యార్ధి అని, పరీక్షలో ఫెయిల్ కావడం, డిగ్రీ సర్టిఫికెట్ అందుకోలేకపోవడం, ఇంటర్న్‌షిప్ ఉపకార వేతనం అందకపోవడంతో అసంతృప్తితో ఉన్మాదిగా ప్రవర్తించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిలో మరి కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

చైనాలోని దక్షిణ నగరమైన జూహైలో ఓ యువకుడు కారుతో బీభత్సం సృష్టించిన ఘటన మరువక మునుపే ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఓ యువకుడు ఇటీవల జూవైలో ఎస్‌యూవీ కారుతో బీభత్సం సృష్టించాడు. కారును వేగంగా నడుపుతూ పాదచారులపై దూసుకువెళ్లాడు. దీంతో 30 మంది మృతి చెందారు. మరో 43 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు కారణమైన ఉన్మాది.. తర్వాత కత్తితో తన మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Latest sport news. ??.