AP Deputy CM Pawan Kalyan speech in maharashtra

సనాతన ధర్మ పరిరక్షణే జనసేన లక్ష్యం: పవన్ కళ్యాణ్

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహాయుతి కూటమి గెలుపు కోసం డెగ్లూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సనాతన ధర్మ పరిరక్షణే జనసేన లక్ష్యమని పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ నడిచిన నేలపై తాము ఎవ్వరికీ భయపడేది లేదన్నారు. దమ్కీలకు ఎట్టి పరిస్థితిలో కూడా భయపడేది లేదని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. దేశంలో ప్రతి హిందువు గుండెలో రామనామం లేకుండా ఉండదని అన్నారు.

కాగా, సినిమాల్లో పోరాటాలు చేయడం, గొడవ పెట్టడం చాలా ఈజీ అని.. నిజ జీవితంలో ధర్మం కోసం కొట్లాడటం, నిలబడటం చాలా కష్టమని తెలిపారు. హిందువులంతా ఏకమైతే.. హైదరాబాద్ నుంచి దేశాన్ని విచ్ఛినం చేసేందుకు వచ్చే వాళ్లు ఎంత అంటూ ఒవైసీ సోదరులను ఉద్దేశించి ఆయన హాట్ కామెంట్ చేశారు. ఛత్రపతి శివాజీ నడిచిన నేలలో ఎలాంటి దమ్కీలకు భయపడేది లేదంటూ.. మజ్లిస్ పార్టీ నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

అయితే తాను ఇక్కడికి ఓట్లు అడిగేందుకు రాలేదని, మరాఠా వీరులకు నివాళి అర్పించడానికి వచ్చానని పవన్ తెలిపారు. మరాఠా యోధుల పోరాటాన్ని గుర్తుచేసుకోవడానికి, శివాజీ మహరాజ్ పరిపాలనను, స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని గుర్తుచేసుకోవడానికి వచ్చానని వివరించారు. స్వరాజ్యం అర్థం తెలిపిన నేల, అంబేద్కర్ జన్మించిన నేలపై నివాళులు అర్పించేందుకు వచ్చానని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Batam semakin indah, bp batam bangun bundaran punggur. Valley of dry bones. Latest sport news.