ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. మరో బీఆర్‌ఎస్‌ నేతకు నోటీసులు జారీ

Phone tapping case.. notices issued to another BRS leader

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇప్పటీకే బీఆర్‌ఎస్‌ నేత కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం జూబ్లీహిల్స్‌ పోలీసుల ఎదుట జైపాల్ యాదవ్ విచారణకు సైతం హాజరయ్యారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేయగా, ఆయన కూడా విచారణకు హాజరయ్యారు. అయితే నోటీసులు అందుకున్న వెంటనే జైపాల్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీ సీసీపీ వెంకటగిరి జైపాల్ యాదవ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు.

మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ కాగా.. రాజకీయ నాయకులు కూడా అరెస్ట్ అవుతారంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) చీఫ్ ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నారు. ఆయనను రప్పించేందుకు కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు పోలీసులు ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నలుగురి కాల్ డేటాలు విశ్లేషిస్తున్న అందులోని వివరాల ఆధారంగా ఒక్కొక్కరికీ నోటీసులు ఇస్తూ విచారిస్తున్నారు. కాగా, ఇటీవలే ఫోన్ టాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారించి స్టేట్ మెంట్ రికార్డు చేసిన విచారణ అధికారి… ఇప్పుడు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను విచారణకు పిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *