Chief Minister Chandrababu on Delhi tour

ఢిల్లీ పర్యటలో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి: ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నిన్న(శుక్రవారం) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ , విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్‌తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రపంచ బ్యాంకు, ఏడీబీలు ఇవ్వబోతున్న రుణాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా వచ్చేలా చూడాలని కోరినట్లు సమాచారం. అలాగే గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి సరిపడా నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నేడు(శనివారం) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో పాల్గొననున్నారు.

నేడు మధ్యాహ్నం హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్‌కు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు చంద్రబాబు ముంబై వెళ్లనున్నారు. ఈ సాయంత్రం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈరోజు థానే, భివండీ ప్రాంతాల్లో ఎన్డీఏ అభ్యర్థుల తరఫున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. రేపు(ఆదివారం) సియోన్ కొలివాడ, వర్లీ ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bahas 2 agenda penting, pjs wali kota batam hadiri rapat paripurna dprd kota batam. Ground incursion in the israel hamas war. Exciting news for cricket fans ! the lanka premier league 2023 (lpl 2023) is making a big leap by broadcasting its.