NBK109 title

బాలయ్య ఫ్యాన్స్ పూనకాలు సిద్ధంగా ఉండండి..

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న ‘NBK109’ నుంచి రేపు (నవనార్ 15) టైటిల్ & టీజర్ విడుదల కాబోతుంది. నందమూరి బాలకృష్ణ జోరు మామూలుగా లేదిప్పుడు. ఒకడు నాకెదురొచ్చినా.. నేను ఒకడికి ఎదురొచ్చినా రిస్క్ నీకే అన్నట్లుంది ఆయన దూకుడు. వరస విజయాలు.. మరోవైపు రాజకీయాలు.. ఇంకోవైపు అన్‌స్టాపబుల్ షో.. ఇలా బాలయ్యకు తిరుగేలేదిప్పుడు. వరుస విజయాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తన సినిమాలకు భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నారు.

‘అఖండ ,’ ‘వీరసింహారెడ్డి,‘భగవంత్ కేసరి’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న బాలకృష్ణ ..ఇప్పుడు ‘NBK 109’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి, ఎప్పటినుండో అభిమానులు ఈ సినిమా టైటిల్ ఏంటనే టెన్షన్ లో ఉన్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, యాక్షన్ గ్లింప్సెస్ తో బాలయ్య తన మాస్ లుక్ లో అదరగొడతారని అర్థమైంది. అలాగే, ఈ చిత్రంలో బాలయ్యను ఇప్పటి వరకు చూడని విధంగా చూపించేందుకు బాబీ ప్రత్యేకంగా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు టాక్.

కాగా రేపు శుక్రవారం ఉదయం 10.24 గంటలకు ఈ మూవీ టీజర్ వీడియో రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించి అభిమానుల్లో జోష్ పెంచారు. నిర్మాత నాగవంశీ ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిపారు. ‘రేపు వచ్చే అదిరిపోయే BGM కోసం సిద్ధంగా ఉండండి. బాలయ్య బాబు సినిమాలకు తమన్ ఎందుకు మ్యూజిక్ అందించాలో మీకే తెలుస్తుంది’ అని చేసిన ట్వీట్ అంచనాలను పెంచేసింది. సంక్రాంతి సీజన్‌లో ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేస్తారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Dprd kota batam. Easy diy power plan gives a detailed plan for a. India vs west indies 2023 archives | swiftsportx.