Attack on iron rod

గాజువాకలో దారుణం ..

ఏపీలో మహిళలపై దాడులు ఆగడం లేదు. ప్రభుత్వం మారినాకని ప్రేమన్మధులు , కామాంధులు మారడం లేదు. ప్రతి రోజు అత్యాచారం , లేదా ప్రేమ వేదింపులు అనేవి వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ఇలాంటి వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం చెపుతున్నప్పటికీ వారు మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు. తాజాగా గాజువాక లో దారుణం జరిగింది.

పెదగంట్యాడ లో యువతిపై జమ్మూ కాశ్మీర్‌కు చెందిన నీరజ్‌ శర్మ రాడ్‌తో దాడి చేశాడు.. అడ్డుకునేందుకు యత్నించిన మరో ఇద్దరిపై కూడా దాడికి పాల్పడ్డాడు. అయితే బాధితురాలు గట్టిగ కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు. ఉన్మాది దాడిలో గాయపడిన యువతిని స్థానికులు హాస్పటల్ కు తరలించారు. ఇక, ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడ్డ యువతికి మెరుగైన వైద్యం కోసం కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ఆమె తలపై సుమారు 30 కుట్లు పడ్డాయి.

ఇక కాశ్మీర్ కి చెందిన యువకుడి నీరజ్ తో విశాఖ గాజువాక కు చెందిన మేఘనకు కొన్ని ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది.. రాజస్థాన్ లో ఓ దైవ కార్యక్రమంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తర్వాత అతని ప్రవర్తన నచ్చక ప్రేమకు బ్రేకప్ చెప్పేసింది. దీంతో మేఘన మీద పగ పెంచుకున్న నీరజ్.. ఆమెను మానసికంగా హింసించసాగాడు. ఆమె ఫొటోలను న్యూడ్ ఫొటోలకు జతచేసి సోషల్ మీడియాలో మేఘన బంధువులకు పంపించేవాడు. దీనిపై విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోయింది. న్యూ పోర్ట్ పోలీసులకు నీరజ్ తో తమ కూతురుకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వాపోయారు బాధితురాలి తండ్రి పాపారావు. ఈరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో హెల్మెట్ పెట్టుకుని వచ్చి కూతురు తలపై ఒక రాడ్డుతో బలంగా కొట్టి తీవ్రంగా గాయపరిచినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Dprd batam gelar paripurna bahas ranperda angkutan massal dan perubahan perda pendidikan. Ground incursion in the israel hamas war. Lanka premier league archives | swiftsportx.