16300 posts will be filled. Minister Lokesh announced in the Assembly

16,300 పోస్టులు భర్తీ చేస్తాం..అసెంబ్లీలో మంత్రి లోకేశ్‌ ప్రకటన

అమరావతి: రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే మంత్రి నారాలోకేశ్‌ అసెంబ్లీలో లోకేష్‌ మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వం మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేసామని..16, 300 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. ముందుగా టెట్ నిర్వహించామన్నారు. సుమారుగా 595 ఖాళీలు ఇంకా ఉన్నాయని చెప్పారు. రిటైర్మెంట్ వయసు పై అధికారులతో, సీఎం రివ్యూలో చర్చించి నిర్ణయిస్తామని లోకేశ్‌ వెల్లడించారు. 1998 డీఎస్సీ అభ్యర్ధుల విషయంలో ఒక పద్ధతి ప్రకారం నిర్ణయిస్తామన్నారు. ఎటువంటి పిటిషన్లు పడకుండా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు.

ఇక.. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… 2014-19 లో గత టీడీపీ పాలనలో 3038 కోట్లు ఖర్చుపెట్టి 40 పనులు పూర్తి చేసామని.. 2019-24 వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో కేవలం 760 కోట్లు ఖర్చుపెట్టి 5 శాతం పనులు మాత్రమే చేశారన్నారు. పట్టిసీమ, పురుషోత్తమ పట్నం, చింతలపూడి ఎత్తిపోతల పథకాల పై తమ అనుచరులతో ఎన్జీటీ లో కేసులు వేయించిందని వైఎస్ఆ‌ర్‌సీపీ పై ఆగ్రహించారు మంత్రి నిమ్మల రామానాయుడు.

కాగా, ఇదిలా ఉంటే శాసన మండలి కూడా ఈ రోజు ఉదయం 10 గంటలకు అయింది. ప్రశ్నోత్తరాల సెషన్‌తో ప్రారంభంగా ఈ సెషన్‌లో.. ఫ్రీ హోల్డ్ భూములు క్రమబద్దీకరణ, కైకలూరు నియోజకవర్గంలో రహదారుల మరమ్మతులు, 2019 – 24 వరకు మద్యం అమ్మకాలలో జరిగిన అక్రమాలు, గ్రామాల్లో డంపింగ్ యార్డులు, పంట రుణాలపై అధిక వడ్డీ, విజయనగరంలో ఆతిసారం, పీడీఎస్ బియ్యం అక్రమాలు, ఉచితపంటల భీమా పథకం, పంచాయితీ భవనాలకు రంగులు, పాఠశాల బస్సులకు పన్ను అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రశ్నోత్తరాలు జరిగాయి. ప్రశ్నోత్తరాల అనంతరం 2024 – 25 ఆర్ధిక బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Dprd kota batam. Thаt both kane аnd englаnd wоuld bе bеttеr off іf hе retired frоm international fооtbаll. Latest sport news.