Pawan Kalyan will participate in Maharashtra Assembly Elections campaign

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ప్రచారంలో పాల్గొననున్న పవన్ కల్యాణ్

అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు పవన్‌ కళ్యాణ్‌ మహారాష్ట్రలోని వివిధ జిల్లాల్లో రోడ్‌ షోలలు, బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొననున్నారు. పవన్‌తో పాటు మహారాష్ట్రకు జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వెళ్లనున్నారు. ఆయనతో కలిసి ప్రచారంలో పాల్గొననున్నారు నాదెండ్ల. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో పార్టీలన్నీ ప్రచార సభలతో హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే మ్యానిఫెస్టోలు విడుదల చేశాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 20న జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలను ఈ నెల 23న ప్రకటిస్తారు.

ఇకపోతే..ఇటీవల ఢిల్లీ లో హోం మంత్రి అమిత్ షాను కలిసిన సమయం లో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వలసిందిగా జన సీనానిని కోరారు. దీంతో పవన్ తన ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను ఖరారు చేసుకున్నారు మహారాష్ట్ర లోని తెలుగు వారు అధికంగా నివసించే ప్రాంతాల్లో ఈ నెల 16,17 తేదీల్లో ఎన్డీఏ కూటమి తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. కాగా, ఆ రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలకు ఆ ఇద్దరు నేతలు అందుబాటులో ఉండకపోవచ్చు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో పార్టీలన్నీ ప్రచార సభలతో హోరెత్తిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Dprd kota batam. Com – gaza news. Latest sport news.