అప్పుడే వణికితే ఎలా మంత్రులు..? – కేటీఆర్ ట్వీట్

Will march across the state. KTR key announcement

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్..సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన లో ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్‌ తో సమావేశం కాబోతున్నారు. కాగా కేటీఆర్ ఢిల్లీ పర్యటన పై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేసారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి కేటీఆర్ ఢిల్లీ వెళ్లాడని మంత్రులు ఆరోపించారు.

తన ఢిల్లీ టూర్‌పై మంత్రులు చేస్తున్న విమర్శలపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ‘అప్పుడే వణికితే ఎలా? ఇప్పుడే ఢిల్లీలో అడుగుపెట్టాను, హైదరాబాద్‌లో ప్రకంపనలు ప్రారంభమైనట్లు తెలిసింది’ అంటూ కేటీఆర్ నవ్వుతున్న ఎమోజీ పెడుతూ సెన్సేషనల్ ట్వీట్ చేశారు. అమృత్ టెండర్ల విషయంలో జరిగిన అవకతవకలపై మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలుస్తుంది. రూ. 8888 కోట్ల విలువైన టెండర్లను సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి అక్రమంగా కట్టబెట్టారని కేటీఆర్ గతంలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ టెండర్ల విషయంలో సృజన్ రెడ్డికి చెందిన షోద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ అపాయింట్ మెంట్ తీసుకుని కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు.

అలాగే వికారాబాద్ జిల్లాలో ఫార్మా సిటీకి వ్య‌తిరేకంగా ప్ర‌భుత్వ అధికారుల‌పై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ్డ ఘ‌ట‌న‌పై కూడా కేటీఆర్ స్పందించారు. ఇది ప్రజా పాల‌న కాదు.. ప్రజ‌లు తిర‌గ‌బ‌డుతున్న పాల‌న‌.. ఏడాదిలోనే ఎదురీదుతున్న పాల‌న అని పేర్కొన్నారు. ఆంక్షలు పెట్టి.. ప్రజాకాంక్షలను తొక్కేస్తామంటే తెలంగాణ నేల ఊరుకోదు.. తిర‌గ‌బ‌డుతుంది.. త‌రిమికొడుతుంది.. త‌స్మాత్ జాగ్రత్త అని కేటీఆర్ హెచ్చ‌రించారు.

ఫార్మా రైతులకు న్యాయం చేస్తామని కల్లిబొల్లి కబుర్లు చెప్పినోళ్లు.. సెక్యూరిటీ లేకుండా నీ సొంత జిల్లా దుద్యాల మండలంకు వచ్చే దమ్ముందా? అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ స‌వాల్ విసిరారు. మీ మోసాలకు అధికారులను ఎందుకు బలిపశువులు చేస్తారు? అని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జై తెలంగాణ‌..జై జై తెలంగాణ‌!! అని కేటీఆర్ ట్వీట్ చేసారు.

ఇది ప్రజా పాల‌న కాదు
ప్రజ‌లు తిర‌గ‌బ‌డుతున్న పాల‌న‌
ఏడాదిలోనే ఎదురీదుతున్న పాల‌న‌

ఆంక్షలు పెట్టి..
ప్రజాకాంక్షలను తొక్కేస్తామంటే
తెలంగాణ నేల ఊరుకోదు..
తిర‌గ‌బ‌డుతుంది.. త‌రిమికొడుతుంది
త‌స్మాత్ జాగ్రత్త!

ఫార్మా రైతులకు న్యాయం చేస్తామని కల్లిబొల్లి కబుర్లు చెప్పినోళ్లు… pic.twitter.com/STeAWm002c— KTR (@KTRBRS) November 11, 2024

రాష్ట్రంలో పరిపాలనా వైఫల్యం, శాంతిభద్రతల వైఫల్యానికి తాజా ఉదాహరణ ఇవ్వాళ రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గం కొడంగల్‌లో ఏకంగా జిల్లా కలెక్టర్ మీదనే తిరగబడ్డ రైతులు. ముఖ్యమంత్రి మూర్ఖత్వం వల్ల అధికారులు దెబ్బలు తినాల్సి రావడం దురదృష్టకరం.

నిజానికి రేవంత్ రెడ్డి దురాశ వల్ల,… pic.twitter.com/8QVfPdu2Yt— KTR (@KTRBRS) November 11, 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest sport news. But іѕ іt juѕt an асt ?. Will provide critical aid.