ఉద్యోగ నియామకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వడం అలవాటుగా పెట్టుకుందని, ఏఎంవీఐ ఉద్యోగాల్లోనూ మళ్లీ అదే తంతు ప్రదర్శించిందని హరీష్ రావు మండిపడ్డారు. ఏఎంవీఐ ఉద్యోగ నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 31వ తేదీన కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందని, 2023జూన్ 28న పరీక్ష నిర్వహించిందని హరీష్ రావు గుర్తు చేసారు.
అయితే నియమకపత్రాలను మాత్రం 2024నవంబర్ 11న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంచిందని, ఇది కూడా వేసుకోండి కాంగ్రెస్ ఖాతాలో అని ఎద్దేవా చేశారు. కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా హరీష్ రావు ఈ విమర్శలు చేశారు.
అలాగే వికారాబాద్ జిల్లా ఫార్మా సిటీ (Pharma city) ఘటన పట్ల కూడా హరీష్ రావు..ప్రభుత్వం పై పలు విమర్శలు చేసారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమిని తన రియల్ ఎస్టేట్ దందా కోసం వినియోగిస్తున్నారని అందుకే అక్కడి ప్రజలు అధికారులపై దాడులకు పాల్పడుతున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. ఫార్మా సిటీ కోసం నాడు కేసీఆర్ హైదరాబాద్ దగ్గరగా, కాలుష్యం లేకుండా, జీరో వ్యర్థాలతో 15 వేల ఎకరాలు సేకరించి సిద్ధం చేసిండు. పర్యావరణం, అటవీ సహా అన్ని రకాల అనుమతులు వచ్చినా దాన్ని పక్కన బెట్టి పచ్చటి పొలాల్లో రేవంత్ ఫార్మా చిచ్చు పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గరీబీ హటావో అని ఇందిరా గాంధీ పిలుపునిస్తే..ఫార్మా సిటీ పేరుతో పచ్చని పంట పొలాల నుంచి కిసాన్ హటావో అని రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నాడని హరీష్ రావు ఎద్దేవా చేసారు.
మళ్లీ అదే తంతు..
AMVI నోటిఫికేషన్ ఇచ్చింది:
కేసిఆర్ గారు ( 31-12-2022).
పరీక్ష నిర్వహించింది:
కేసీఆర్ గారు (28-06-2023)
నియమకపత్రాలు పంచింది:
రేవంత్ రెడ్డి (11-11-2024)
ఇది కూడా వేసుకోండి కాంగ్రెస్ ఖాతా లో @revanth_anumula pic.twitter.com/NzTBTRQYYM— Harish Rao Thanneeru (@BRSHarish) November 11, 2024