ఇక భవిష్యత్తులో ఒకటే ఇజం..అదే టూరిజం: సీఎం చంద్రబాబు

Future, There Will Be Only One Thing, That Is Tourism: CM Chandrababu

విజయవాడ: విజయవాడ – శ్రీశైలం మధ్య ఆధ్యాత్మికతను పెంచేలా, ఏపీ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా దేశంలోనే తొలిసారి సీ ప్లేన్ సర్వీసులను ఏపీలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ..రాష్ట్రంలో గత 5 ఏళ్లలో గాడితప్పిన పరిపానను, దెబ్బతిన రాష్ట్ర ప్రతిష్ఠను తిరిగి సంపాదిస్తానని సీఎంచంద్రబాబునాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు.

కూటమి ప్రభుత్వం వచ్చి 150 రోజులైందని, ఎంత త్వరగా అనుకున్న ప్రగతిని సాధించాలో దానికోసం ఆలోచిస్తూ ముందుకు పోతున్నామని అన్నారు. తను ఇప్పుడు నాలుగో టర్మ్ సీఎంగా చేస్తున్నానని, కానీ గత మూడు టర్మ్‌లతో పోల్చితే ఈ టర్మ్‌లో పరిపాలన గాడిన పెట్టడం కష్టంగా ఉందని, అయినా తాను ఎంత కష్టమైనా భరించి రాష్ట్రాన్ని గాడిన పెడతానని, అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం గెలుపు ప్రజలదేనని, వెంటిలేటర్‌పైన ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారని ప్రజలన్ని చంద్రబాబు కొనియాడారు. అలాగే ప్రపంచంలో ఇక భవిష్యత్తంతా టూరిజందేనని, క్యాపిటలిజం. సోషలిజం. కమ్యూనిజం అన్నీ ఇజాలు పోయాయని, ఇక భవిష్యత్తులో ఒకటే ఇజం ఉంటుందని, అదే టూరిజం అని, ప్రపంచం మొత్తం ఇదే జరుగుతుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. అలాగే సీప్లేన్ సర్వీసులను ప్రారంభించడంలో కీలక పాత్ర వహించిన స్పైస్ జెట్ సంస్థను అభినందించారు.

‘‘టూరిజం డెవలప్ కావాలంటే మంచి రోడ్లు కావాలి. మంచి ప్రదేశాలు కావాలి. మంచి రవాణా వసతులు కావాలి. మంచి హోటళ్లు కావాలి. ఇవన్నీ డెవలప్ చేయడానికి మేం శాయశక్తుల ప్రయత్నిస్తాం. తప్పకుండా టూరిజం ద్వారా రాష్ట్రంలో ఉపాధిని, ఆదాయాన్ని క్రియేట్ చేస్తాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో మసకబారిన ఏపీ ఇమేజ్‌ను సరిచేసే పనిలోనే మేం ఉన్నాం. ఏపీని టూరిజం హబ్‌గా మారుస్తాం. పెద్ద ఎత్తున టూరిస్టులు వచ్చేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం’’ అని ఏపీ సీఎం తెలిపారు. ‘‘అరకు కాఫీ వరల్డ్ ఫేమస్. చాలా దేశాల్లో దాన్ని విక్రయిస్తారు. అరకుకు వెళ్లి అక్కడి కాఫీ తోటల మధ్య కూర్చొని కాఫీ తాగితే ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది. అరకు లాంటి చాలా ప్రదేశాలు ఏపీలో ఉన్నాయి’’ అని చంద్రబాబు చెప్పారు. ‘‘రాష్ట్ర ప్రజలంతా కలిసి ఏపీని తిరిగి నిలబెట్టారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ప్రజలే ఆక్సిజన్‌ ఇచ్చారు’’ అని ఆయన తెలిపారు. ‘‘తక్కువ సమయంలోనే అత్యున్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి రామ్మోహన్‌ నాయుడు. కేంద్ర మంత్రివర్గంలో అత్యంత యువకుడు ఆయన’’ అని ఏపీ సీఎం కితాబిచ్చారు.

దేశంలోనే సీ ప్లేన్ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభం కానుందన్నారు. కొన్ని మార్గదర్శకాలు మార్చి సామాన్యులకు అందుబాటు ధరలో ఉండేట్లు స్కీం ను రూపొందిస్తున్నామని వివరించారు. ఎయిర్ పోర్ట్ కట్టాలంటే కనీసం 500 ఎకరాల అవసరం లేకుండా వాటర్ ఏరో డ్రోమ్స్ సహాయంతో ఎయిర్ ట్రావెల్ కు అవకాశం ఉందని వెల్లడించారు. అతి చిన్న దేశం మాల్దీవుస్ లో సీ ప్లేన్ ద్వారా చాలా ఆదాయం వస్తుందని తెలిపారు. అలాంటిది 140 కోట్ల జనం, 1350 దీవులు ఉన్న భారత దేశం లో సీ ప్లేన్ ఆపరేషన్స్ ఒక విప్లవం కానున్నాయని వివరించారు. అందుకు అమరావతినే మొదటి వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. సీ ప్లేన్ ఆపరేషన్స్ కు కేవలం రాష్ట్రాన్నే కాదు దేశ గతినే మార్చే శక్తి ఉందని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

登录. Because the millionaire copy bot a. Used 2021 grand design momentum 399th for sale in arlington wa 98223 at arlington wa cy176a.