GEF India launched Freedom Park to promote community wellness

కమ్యూనిటీ వెల్‌నెస్‌ను ప్రోత్సహించడానికి ‘ఫ్రీడం పార్క్’ని ప్రారంభించిన జీఈఎఫ్ ఇండియా

సమాజం యొక్క విభిన్న అవసరాలను తీర్చగల సమ్మిళిత , పర్యావరణ అనుకూల స్థలాలను ఫ్రీడమ్ పార్క్ సృష్టిస్తుంది

Hyderabad: ఫ్రీడమ్ హెల్తీ వంట నూనెల తయారీదారులు, జెమిని ఎడిబుల్ & ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ (జీఈఎఫ్ ఇండియా) తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమంలో భాగంగా ‘ఫ్రీడం పార్క్’ ని ప్రారంభించింది. కూకట్‌పల్లి మరియు చుట్టుపక్కల ప్రాంతాలలోని ప్రజలకు విశ్రాంతి తీసుకోవడానికి, వ్యాయామం చేయడానికి, ఆడుకోవడానికి మరియు బంధాలను పెంచుకోవటానికి ప్రత్యేకంగా రూపొందించిన హరిత ప్రాంగణం ఇది. ఈ పార్క్‌ను శ్రీ అక్షయ్ చౌదరి, జీఈఎఫ్ ఇండియా గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ మరియు జీఈఎఫ్ ఇండియా సేల్స్ & మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ పి . చంద్ర శేఖర రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) నుండి ప్రతినిధులు మరియు స్థానిక నివాసితుల హాజరయ్యారు.

జీఈఎఫ్ ఇండియా ఈ ఫ్రీడం పార్క్‌ను రూ. 2.76 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసింది. ఇది జాగింగ్/వాకింగ్ ట్రాక్, ఒక యాంఫీథియేటర్, కమ్యూనిటీ సమావేశాల కోసం కవర్ జోన్, ప్రకాశవంతమైన మరియు రంగురంగుల స్వింగ్‌లతో కూడిన ప్రత్యేక పిల్లల ఆట స్థలం, బహిరంగ వ్యాయామశాల కోసం పరికరాలు, యోగా జోన్, బెంచీలు, వాష్‌రూమ్ మరియు పార్కులో ఆకర్షణీయమైన ల్యాండ్‌స్కేపింగ్‌ కలిగి వుంది. ఇది కాంక్రీట్ జంగిల్ మధ్య స్వాగతించే ఏకాంత ప్రదేశంగా నిలుస్తుంది. ఈ కార్యక్రమం తాము నివసించే మరియు పని చేసే కమ్యూనిటీల నడుమ ఆరోగ్యకరమైన మరియు చురుకైన జీవనశైలిని ప్రోత్సహించాలనే జీఈఎఫ్ ఇండియా యొక్క అంకితభావాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. విస్తారమైన సౌకర్యాలతో, వినోదం, ఆరోగ్యం మరియు సామాజిక అనుసంధానిత కోసం ప్రతిష్టాత్మకమైన వనరుగా ఈ పార్క్ మారింది, నిర్మలమైన ఆకుపచ్చ వాతావరణంలో విశ్రాంతి తీసుకోవడానికి మరియు ప్రకృతితో మమేకం కావడానికి నివాసితులను ఆహ్వానిస్తుంది.

శ్రీ అక్షయ్ చౌదరి, జీఈఎఫ్ ఇండియా గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, “బాహ్య కార్యకలాపాలు, కుటుంబ సమావేశాలు మరియు ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించే సురక్షితమైన మరియు స్వాగతించే వాతావరణాన్ని సృష్టించడం మా లక్ష్యం. ఫ్రీడమ్ పార్క్ వినోదం మరియు సామాజిక అనుసంధానిత కోసం ఒక ముఖ్యమైన వనరుగా ఉపయోగపడుతుంది, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తూ కమ్యూనిటీని మరింత దగ్గరకు తీసుకురావడానికి సహాయపడుతుంది. నివాసితులు విశ్రాంతి తీసుకోవడానికి మరియు ప్రకృతితో కనెక్ట్ అయ్యే స్వర్గధామంగా మేము దీనిని భావిస్తున్నాము ” అని అన్నారు.

జెమినీ ఎడిబుల్స్ & ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్, సేల్స్ & మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ పి. చంద్ర శేఖర రెడ్డి మాట్లాడుతూ, “ఫ్రీడమ్ ఆయిల్‌ వద్ద , ప్రజలు ఆరోగ్యంగా తినడానికి మరియు ఆరోగ్యంగా జీవించడానికి ప్రోత్సహించడాన్ని మేము విశ్వసిస్తున్నాము. జీహెచ్ఎంసీతో మా భాగస్వామ్యం ద్వారా కూకట్‌పల్లి నివాసితుల జీవన నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా సమాజం మరియు శ్రేయస్సు యొక్క భావాన్ని పెంపొందించే ప్రాంగణం ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bahas 2 agenda penting, pjs wali kota batam hadiri rapat paripurna dprd kota batam. Com – gaza news. Latest sport news.