రంజీ ట్రోఫీలో వివాదం రుతురాజ్ గైక్వాడ్ కఠిన వ్యాఖ్యలు, అంపైర్ నిర్ణయంపై అసహనం భారత క్రికెట్ ప్రపంచంలో రంజీ ట్రోఫీలోని ఒక వివాదాస్పద ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీమిండియా బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ వివాదంపై స్పందిస్తూ అంపైర్ నిర్ణయం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఈ అంశంలో మహారాష్ట్ర జట్టు కెప్టెన్ అంకిత్ బవానెకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం రుతురాజ్‌కు ఆగ్రహం తెప్పించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఘటనపై గైక్వాడ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. రంజీ ట్రోఫీ గ్రూప్ ఏలో భాగంగా మహారాష్ట్ర వర్సెస్ సర్వీసెస్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ పుణెలో జరిగింది. ఈ సమయంలో మహారాష్ట్ర జట్టు కెప్టెన్‌గా ఉన్న అంకిత్ బవానె అంపైర్ తప్పుడు నిర్ణయంతో ఔటయ్యాడు. సర్వీసెస్ బౌలర్ అమిత్ శుక్లా బౌలింగ్‌లో అంకిత్ బవానె షాట్‌కు ప్రయత్నించినప్పుడు, బంతి సెకండ్ స్లిప్ వైపునకు వెళ్లింది. సర్వీసెస్ ఫీల్డర్ శుభమ్ రొహిల్లా క్యాచ్ అందుకున్నాడు అని భావించగా, వీడియోలో బంతి నేలకు తాకినట్లు కనిపించింది.
బంతి నేలకు తాకినట్లు స్పష్టంగా కనిపించినా, సర్వీసెస్ జట్టు ఔట్‌గా అపీల్ చేసింది. మ్యాచ్ రిఫరీతో చర్చించిన అనంతరం, ఫీల్డ్ అంపైర్లు అంకిత్‌ను ఔట్‌గా ప్రకటించారు. ఈ నిర్ణయం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది, ఎందుకంటే కెమెరా వీడియోలో బంతి నేలకు తాకినట్లు స్పష్టంగా కనిపించింది. మహారాష్ట్ర కెప్టెన్ అంకిత్‌కు ఇది కీలకమైన ఔట్ కాగా, రుతురాజ్ గైక్వాడ్ ఈ విషయాన్ని స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు.
ఈ వివాదాస్పద నిర్ణయం పట్ల రుతురాజ్ తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ, ఇలాంటి ఔట్‌ను ఎలా ఇస్తారు అది క్యాచ్ ఔట్‌గా అపీల్ చేయడం సిగ్గుచేటు. ఇది కేవలం దారుణం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రంజీ ట్రోఫీ లాంటి పోటీలలో అంపైరింగ్ మీద ఇలాంటి ప్రశ్నలు రావడం విచారకరం. అంతేకాకుండా, అంకిత్ బవానె 73 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచినందున, అతని ఔట్ నిర్ణయం మహారాష్ట్ర జట్టుకు ప్రతికూలంగా మారింది.
ఈ మ్యాచ్‌లో సర్వీసెస్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 293 పరుగులు సాధించింది. అంకిత్ ఔట్ అయిన తర్వాత, మహారాష్ట్ర జట్టు నాలుగు వికెట్లు కేవలం 21 పరుగులకే కోల్పోయింది. సర్వీసెస్ బౌలర్ అమిత్ శుక్లా ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చూపించాడు. ఈ వివాదాస్పద నిర్ణయం కారణంగా మహారాష్ట్ర జట్టు చివరికి 185 పరుగులకే ఆగిపోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ రంజీ ట్రోఫీ లాంటి ప్రతిష్టాత్మక పోటీలలో అంపైరింగ్‌కు సంబంధించి ప్రశ్నలు రేకెత్తిస్తోంది. రుతురాజ్ గైక్వాడ్ చేసిన ఈ కఠిన వ్యాఖ్యలు అంపైరింగ్ ప్రమాణాలపై క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.