హారర్ మూవీ 45 నిమిషాల గ్రాఫిక్స్ ఎర్రచీర హైలెట్స్

erra cheera

హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఎర్రచీర ది బిగినింగ్ సినిమా గ్లింప్స్‌ను గ్రాండ్‌గా విడుదల చేశారు. బేబి డమరి సమర్పణలో, శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, తెలుగు సినిమాలకు కొత్త జోష్ ఇవ్వబోతుంది.
ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్, ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని ముఖ్యపాత్రలో నటిస్తోంది. హార్రర్, యాక్షన్, మదర్ సెంటిమెంట్ నేపథ్యంతో రూపొందించిన ఈ చిత్రం, సుమన్ బాబు దర్శకత్వంలో తెరపైకి రానుంది. డిసెంబర్ 20న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, హార్రర్, దేవుడు కాన్సెప్ట్‌తో సినిమా రూపొందించడం ప్రస్తుతం ట్రెండ్ అయ్యింది. కానీ, ఈ చిత్రం దానిని అధిగమించి, మరింత డిఫరెంట్‌గా రూపొందించబడింది. కొత్త టాలెంట్‌ను తీసుకొచ్చే విధంగా, బేబి సాయి తేజస్విని ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా విజయవంతమై, టీమ్‌కు పెద్ద సక్సెస్ అందించాలని ఆశిస్తున్నా, అని చెప్పారు.

సుమన్ బాబు మాట్లాడుతూ, ఈ చిత్రంలో 22 పాత్రలు ఉన్నాయి, వాటితో పాటు ‘ఎర్రచీర’ కూడా 23వ పాత్రగా ఉంటది. మొత్తం 45 నిమిషాలు గ్రాఫిక్స్‌తో చిత్రాన్ని రూపొందించాం. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాం, అని తెలిపారు. గ్లింప్స్‌లో ‘హర హర మహాదేవా’ అనే పాట వచ్చినప్పుడు అందరికీ గూస్ బంప్స్ వచ్చాయి. బేబి సాయి తేజస్విని నటన ఆకట్టుకుంటుంది, మరియు కథలో మదర్ సెంటిమెంట్ అభిమానులను మనస్సు స్పర్శిస్తుంది, అని హీరోయిన్ కారుణ్య చౌదరి చెప్పింది. ఈ సినిమా ప్రేక్షకులను మోక్షం చూపించి, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించబడినట్లు చిత్ర బృందం చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Latest sport news. 禁!.