టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పదవి బాధ్యతలు చేపట్టారు. రీసెంట్ గా టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) నూతన బోర్డు సభ్యులను ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు . టీటీడీ చైర్మన్ పదవిని టీవీ-5 అధినేత బీఆర్ నాయుడికి అప్పగించారు. టీటీడీ బోర్డు సభ్యులుగా మొత్తం 23 మందిని నియమించారు బోర్డులో నియమితులైన సభ్యులలో ముగ్గురు ఎమ్మెల్యేలు జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ కోవూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మడకశిర నుంచి ఎంఎస్ రాజు ఉన్నారు వీరితో పాటు టీడీపీ నాయకులు పనబాక లక్ష్మి, జాస్తి శివ (సాంబశివరావు) నన్నపనేని సదాశివరావు కోటేశ్వరరావు మల్లెల రాజశేఖర్ గౌడ్ జంగా కృష్ణమూర్తి, శాంతారాం, పి. రామ్మూర్తి, తమ్మిశెట్టి జానకీదేవి, నరేశ్ కుమార్ సభ్యులుగా నియమితులయ్యారు.
తెలంగాణ నుంచి నర్సిరెడ్డి, బుంగునూరు మహేందర్ రెడ్డి, ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్ బురగపు ఆనంద్ సాయి, రంగశ్రీ, భారత్ బయోటెక్ సంస్థకు చెందిన సుచిత్ర ఎల్ల కూడా సభ్యులుగా నియమితులయ్యారు కర్ణాటక నుంచి జస్టిస్ హెచ్‌ఎల్ దత్, దర్శన్ ఆర్‌ఎన్, గుజరాత్ నుంచి డాక్టర్ అదిత్ దేశాయ్, మహారాష్ట్ర నుంచి సౌరబ్ హెచ్ బోరా, తమిళనాడు నుంచి కృష్ణమూర్తి కూడా ఈ బోర్డు సభ్యులుగా ఎంపికయ్యారు. జనసేన కోటాలో తెలంగాణ నుంచి మహేందర్ రెడ్డి కి అవకాశం దక్కింది.