అమెరికా ఎన్నికల్లో పోటీదారుల భవిష్యత్‌ను తేల్చే ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. ఏడు రాష్ట్రాలకు గాను ఆరు రాష్ట్రాల్లో హవా కొనసాగించారు. విస్కాన్సిన్, నార్త్ కరోలినా, అరిజోనా, పెన్సిల్వేనియా, జార్జియా, మిచిగాన్‌లో ట్రంప్ ఆధిక్యం కొనసాగించారు. వీటితోపాట మొత్తం 24 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించారు. కాన్సస్, అయోవా, మోంటానా, యుటా, నార్త్ డకోటా, కెంటకీ, టెన్సెసీ, మిస్సౌరి, మిస్సిస్సిప్పీ, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, ఫ్లోరిడా, ఇదాహో, వ్యోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లాహోమ్, టెక్సాస్, లుసియానా, ఆర్కాన్సస్, లోవా, ఇండియానా లలో ట్రంప్ విజయకేతనం ఎగురవేశారు.
వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియా, కొలరాడో, న్యూ మెక్సికో, ఇల్లినాయిస్, న్యూయార్క్, వేర్మాంట్, మస్సాచుసేట్స్, కెన్నెక్టికట్, రోడ్ ఐలాండ్, న్యూజెర్సీ, డెలావర్, మేరీల్యాండ్, కొలంబియా, వర్జీనియా లలో కమలా హారిస్ విజయం సాధించారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు డొనాల్డ్ ట్రంప్‌దే విజయం అని తెలుస్తుంది.