Former minister Kakani Govardhan Reddy house arrest

మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హౌస్ అరెస్టు

అమరావతి: మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కూనుపూరు కాలువ పరిశీలనకు వెళ్తారన్న సమాచారంతో ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. అయితే నెల్లూరులో కాకాని హౌస్ అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాకాని ఇంటి వద్ధ భారీగా పోలీసులు మోహరించారు. కాకాని హౌస్ అరెస్టును నిరసిస్తూ వైఎస్‌ఆర్‌సీపీశ్రేణులు ఆందోళనకు దిగాయి నెల్లూరు సంగెం ఆనకట్ట వద్ధ టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు బల ప్రదర్శనకు దిగాయి. దీంతో కాకాని కూనుపూరు కాలువ కట్ట పరిశీలనకు వస్తే రగడ తలెత్తవచ్చన్న భావించిన పోలీసులు కాకానిని హౌస్ అరెస్టు చేశారు.

కూటమి ప్రభుత్వ విధానాలపై కాకాని తరుచూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక, మధ్యం మాఫియాను కూటమి ఎమ్మెల్యేలే నడిపిస్తున్నారని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, సీఎం చంద్రబాబుకు దమ్ముంటే వారి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ కాకాని సవాల్ విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shocking incident at st catherine health facility leads to arrests and charges. Latest sport news. But іѕ іt juѕt an асt ?.