తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే రాహుల్ గాంధీ రావాలి : కేటీఆర్

Rahul Gandhi should come only to apologize to the people of Telangana: KTR

హైదరాబాద్‌ : నేడు తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బహిరంగ లేఖ విడుదల చేశారు. అధికారం కోసం అడ్డగోలు హమీలిచ్చి, సబ్బండ వర్గాలకు చేసిన మోసానికి, అభివృద్ధి తెలంగాణను అవినీతి తెలంగాణగా మార్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే రాష్ట్రంలో అడుగు పెట్టాలని రాహుల్‌ గాంధీని కేటీఆర్ డిమాండ్‌ చేశారు. పదేళ్లలో ఘనంగా అభివృద్ధి చెందిన తెలంగాణకు విచ్చేస్తున్న రాహుల్ గాంధీకి.. పచ్చగా ఉన్న తెలంగాణ మీ ఏడాది పాలనలోనే ఏ విధంగా వందేళ్ల విధ్వంసానికి గురైందో మీ రాక సందర్భంగా బహిరంగ లేఖతో ఒక్కసారి మీకు గుర్తు చేయదలచుకున్నానన్నారు.ఆరు గ్యారెంటీలని ప్రజల గొంతుకోశారని, పిలిస్తే పలుకుతానని పారిపోయిందెవరని, ఇన్నాళ్లు ఎక్కడ దాక్కున్నారంటూ రాహుల్ గాంధీని ప్రశ్ని్ంచారు.

రైతులు, నిరుద్యోగులు, పోలీసులు, చేనేత కార్మికులు, ఆటోడ్రైవర్లు అందరూ బాధితులేనని, మూసీ, హైడ్రా పేరిట ప్రజలను వంచించారని, దమ్ముంటే వచ్చి ఆ బాధితులను కలవండని, అశోక్ నగర్ నిరుద్యోగులను పలకరించండని సవాల్ చేశారు. ఇచ్చిన ఒక్క హామీని సైతం నిలబెట్టకోకుండా ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్ని హింసించే పులకేశిగా మారాడని, ఆయన వసూళ్లు తెలిసినా ఢిల్లీ నేతలు ఏం తెలియనట్లుగా నటిస్తూ ఢిల్లీలో గప్‌చుప్‌ అయిపోయారని విమర్శించారు. ఎన్నికలకు ముందు తెలంగాణలో ఏ పిల్లాడికి కూడా కష్టమొచ్చిన సరే ఇలా పిలుస్తే అలా వస్తానని చెప్పి.. తీరా గద్దెనెక్కిన తర్వాత మా ప్రజల గొంతును తడిగుడ్డతో కోశారని ధ్వజమెత్తారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆటోడ్రైవర్లు, చేనేత కార్మికులు, మూసీ, హైడ్రా బాధితులు ఇలా ఒక్కరే కాదు.. సమాజంలో అన్ని వర్గాలను నయనంచనకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

分钟前. Before you think i had to sell anything to make this money…. 2025 forest river puma 403lft.