pawan kalyan to participate in palle panduga in kankipadu

నేడు పిఠాపురంలో పర్యటించనున్న పవన్ కల్యాణ్

అమరావతి: నేడు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గాలలో కూడా డిప్యూటీ సీఎం పర్యటన కొనసాగనుంది. ఈ క్రమంలోనే రెండు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని ప్రారంభించనున్నారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి స్థానిక అధికారులతో సమీక్ష కూడా నిర్వహించనున్నారు. అనంతరం సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులు కూడా విడుల చేయనున్నారు.

కాగా, సోమవారం (నవంబర్ 4) ఉదయం రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి రోడ్డుమార్గంలో 11.30 గంటలకు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు జిల్లా పరిషత్ హై స్కూల్ కు పవన్ కళ్యాణ్‌ చేరుకుంటారు. అక్కడ సైన్స్ ల్యాబ్ ను ప్రారంభిస్తారు. అనంతరం గొల్లప్రోలు హౌసింగ్ కాలనీకి, సూరంపేట హ్యాబిటేషన్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం గొల్లప్రోలు జిల్లా పరిషత్ హై స్కూల్ ను ప్రారంభించి.. తహశీల్దార్ కార్యాలయంలో పనులకు శ్రీకారం చుడతారు.

ఇకపోతే..మధ్యాహ్నం 1 గంటకు చేబ్రోలులో తన నివాసానికి చేరుకుని పవన్‌ కళ్యాణ్‌ విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు చేబ్రోలు నుంచి బయల్దేరి పిఠాపురంలోని టీటీడీ కల్యాణమండపానికి చేరుకుని ఆర్ఆర్ బీహెచ్ఆర్ డిగ్రీ కాలేజీని ప్రారంభిస్తారు, అలాగే కల్యాణమండపం మరమ్మతు పనులు, ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మరమ్మతు పనుల్ని ప్రారంభిస్తారు. పిఠాపురంలోని బాదం మాధవ జిల్లా పరిషత్ హైస్కూల్ ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కాకినాడ రూరల్ లోని పీ.వెంకటాపురం గెస్ట్ హౌస్ కు చేరుకుని, చేబ్రోలులోని తన నివాసానికి వెళ్తారు. రాత్రికి అక్కడే బసచేస్తారు.

ఇంక మంగళవారం ఉదయం డిప్యూటీ సీఎం తన నివాసం నుంచి కొత్తపల్లి పీహెచ్ సీకి చేరుకుని.. పీహెచ్ఎస్ ఔట్ పేషెంట్ విభాగానికి, యు.కొత్తపల్లి మండలంలోని పలు స్కూళ్లకు శంకుస్థాపనలు చేస్తారు. 1 గంటకు చేబ్రోలు నివాసానికి చేరుకుని, 3 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు వెళ్తారు. అక్కడి నుంచి విజయవాడకు వెళ్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gelar rapat paripurna, ini 10 rancangan randerda inisiatif dprd kota batam. “the most rewarding aspect of building a diy generator is seeing the. Lanka premier league archives | swiftsportx.