టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా స్టార్ హీరోగా మెరుస్తున్న ఆయన, కెరీర్ ప్రారంభంలోనే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. చిరంజీవి కెరీర్‌లో హిట్లు కోసం పోరాటం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 1993లో విడుదలైన ముఠా మేస్త్రి సినిమా ఘనవిజయం సాధించడం, దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి నేతృత్వంలో చిరంజీవికి బ్రేక్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత మెకానిక్ అల్లుడు వంటి కొన్ని సినిమాలు విజయవంతం కాలేకపోవడంతో ఆయన నిరాశకు గురయ్యారు ఈ కాలంలో మరొక సినిమా ముగ్గురు మొనగాళ్లు మరియు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన అల్లుడా మజాకా మాత్రమే కొంత సక్సెస్ అందించాయి. కానీ ఈ సినిమాల్లో చిరంజీవి నటనపై విమర్శలు కూడా వచ్చాయి, ముఖ్యంగా అత్తను రేపే అల్లుడు పాత్ర కారణంగా. ఈ మధ్యలో బిగ్‌బాస్ మరియు రిక్షావాడు వంటి సినిమాలు డిజాస్టర్‌గా నిలవడం చిరంజీవికి కష్టతరమైన కాలంగా మారింది.
ఈ సమయంలో చిరంజీవి తన కెరీర్ పునరుజ్జీవనానికి అవకాశం కోసం ఎదురు చూస్తుండగా, మలయాళంలో సూపర్ హిట్ అయిన హిట్లర్ చిత్రాన్ని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. దర్శకుడు ముత్యాల సుబ్బయ్య నేతృత్వంలో, రంభతో కలిసి నటించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఐదుగురు చెల్లెళ్లకు అన్నగా చిరంజీవి నటన ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ సినిమా స్క్రిప్ట్ డిస్కషన్ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.
కథలో హీరో తన చెల్లెలి ప్రేమను అంగీకరించకపోవడం పై ఒక ఆఫీస్ బాయ్ అభిప్రాయం చెప్పడంతో, దర్శకుడు సబ్బయ్య కథలో కొన్ని కీలక మార్పులు చేయాలని నిర్ణయించారు. 1996లో విడుదలైన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందించి, చిరంజీవి కెరీర్‌ను తిరిగి పుంజుకునేలా చేసింది.అప్పటివరకు ఫ్లాపుల పరంపరతో ఇబ్బంది పడుతున్న చిరంజీవికి, ఈ సినిమా ఊహించని విజయం అందించింది. ఒక్కసారిగా కోటికి పైగా రూపాయల కలెక్షన్లు రాబట్టి, ఆయనను తిరిగి విజయబాటలో నిలబెట్టింది. హిట్లర్ చిత్రం చిరంజీవికి మళ్లీ క్రేజ్ పెంచి, ఆయన కెరీర్‌లో మరో గట్టి బలాన్ని ఇచ్చింది.