బన్నీ, శ్రీలీల కలిసి స్టెప్పులు వేస్తే థియేటర్లు ఊగిపోవాల్సిందే..

Actress Sreeleela 1

దర్శకుడు సుకుమార్ ప్రతీ చిత్రంలో ఓ ఐటెం సాంగ్‌ను ప్రత్యేకంగా ఉంచడం సర్వసాధారణం. ‘ఆర్య’ సినిమాతో ప్రారంభమైన ఈ సాంకేతికత, ‘అ అంటే అమలాపురం పాటతో ఎంత పెద్ద హిట్ సాధించిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత వచ్చిన ప్రతి చిత్రంలో సుకుమార్ ఐటెం సాంగ్స్ హిట్‌గా నిలిచాయి జగడం లో ’36-24-36’ పాట ద్వారా మాస్ ప్రేక్షకులను అలరించిన సుకుమార్, ఆర్య 2 లో ‘రింగ రింగ’, 100% లవ్’లో ‘డియ్యాలో డియ్యాల’, ‘1 నేనొక్కడినే లో లండన్ బాబు’, అలాగే ‘రంగస్థలం’లో ‘జిగేలు రాణి’ పాటలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. సుకుమార్ దర్వకత్వంలో వచ్చిన చిత్రాలలో ఒక్క ‘నాన్నకు ప్రేమతో’లోనే ఐటెం సాంగ్ లేదు.

‘పుష్ప 1’లో సమంత రూత్ ప్రభుతో చేసిన ‘ఊ అంటావా ఊఊ అంటావా’ పాట బాలీవుడ్‌లోనూ సంచలనం సృష్టించింది. ఈ పాట హిందీ మార్కెట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో, పుష్ప హిందీ వర్షన్ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విజయంతోనే ‘పుష్ప 2 ది రూల్’లోనూ ఐటెం సాంగ్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈసారి బాలీవుడ్ నటి త్రుప్తి డిమ్రితో పాట చేయాలని ప్రయత్నించినా, ఆమె ఆ అవకాశం నిరాకరించింది. ఆ తర్వాత ‘స్త్రీ 2’ ఫేమ్ శ్రద్ధా కపూర్‌ను ఎంపిక చేసినా, ఆమె రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ కోరడంతో టీమ్ ఆలోచన మార్చుకుంది. చివరికి, టాలీవుడ్‌లో ప్రస్తుతం సూపర్ ఫేమ్ అయిన శ్రీలీలను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

శ్రీలీల డ్యాన్స్ మూమెంట్స్‌కు టాలీవుడ్‌లో మంచి పేరు ఉంది, అలాగే బన్నీ అల్లు అర్జున్ డ్యాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరూ కలిసి స్టెప్పులేయనుండటం వల్ల థియేటర్లలో ఫుల్ జోష్ మ్యూజిక్ బీట్‌లపై వీరి స్టెప్పులు పడితే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. ప్రేక్షకులు కూడా వీరి స్టెప్పులకు కలిసి నాట్యమాడేలా ఉంటారు. ఈ గ్లామరస్ కాంబో ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ప్రేక్షకులకు మరింత ఉత్సాహం కలిగిస్తుందని అనిపిస్తుంది శ్రీలీల ‘గుంటూర్ కారం’ చిత్రంతో పాటు, ప్రస్తుతం నితిన్‌తో ‘రాబిన్‌హుడ్’లోనూ, రవితేజ 75వ సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె స్పీడీ షూటింగ్‌ను క్రమబద్ధీకరించడం వల్ల ‘పుష్ప 2’లో తన పాత్రకూ త్వరగా సెట్ అవుతుందని భావిస్తున్నారు.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    But іѕ іt juѕt an асt ?. Latest sport news. た?.