Vikatakavi:తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్:

vikkatakavi

విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించడంలో నెంబ‌ర్ వ‌న్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా నిలుస్తున్న జీ5, మరొక ప్రత్యేకమైన వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది ఈ సారి ఉత్కంఠభరితమైన కథతో ‘వికటకవి’ అనే సరికొత్త వెబ్ సిరీస్ నవంబర్ 28 నుంచి తెలుగు తమిళ భాషల్లో స్ట్రీమింగ్‌కి సిద్ధంగా ఉంది జీ5 మేకర్స్ ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి విడుదల తేదీని ప్రకటించగా, ఇందులో నరేష్ అగస్త్య మరియు మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు కాగా ప్రతిభావంతుడైన దర్శకుడు ప్రదీప్ మద్దాలి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

తెలంగాణ నేపథ్యంతో రూపొందిన ఈ వెబ్ సిరీస్, స్వతంత్ర భారతదేశంలో మొట్ట మొదటి డిటెక్టివ్ థ్రిల్లర్‌గా ప్రత్యేకతను సంతరించుకుంది హైదరాబాద్ విలీనాన్ని అనుసరించి నల్లమల ప్రాంతంలోని ‘అమరగిరి’ అనే గ్రామం ముప్పై ఏళ్లుగా ఒక శాపం వల్ల పీడితమవుతుందని కథ సాగుతుంది ఈ అంశంపై దర్యాప్తు చేయడానికి డిటెక్టివ్ రామకృష్ణ ఆ ప్రాంతానికి చేరుకుంటాడు అక్కడి ప్రాచీన కథలను తన తెలివితేటలతో వివరిస్తూ అమరగిరి వెనుక దాగి ఉన్న రహస్యాలను రామకృష్ణ వెలికితీయడం సిరీస్‌లో ప్రధానాంశంగా నిలుస్తుంది రామకృష్ణకి ఎదురయ్యే సవాళ్లు ఆయనకు అమరగిరి గ్రామంతో ఉన్న ప్రత్యేకమైన అనుబంధం వంటి అంశాలు సిరీస్‌లో థ్రిల్లింగ్‌ను మరింత పెంచుతాయని మేకర్స్ చెబుతున్నారు అజయ్ అరసాడ సంగీతం అందిస్తుండగా షోయబ్ సిద్ధికీ ఈ సిరీస్‌కు చక్కని టోగ్రఫీ అందించారు ‘వికటకవి’ సిరీస్ ప్రేక్షకులను అలరించి మరచిపోలేని అనుభవాన్ని అందిస్తుందనే నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    It’s just that mоѕt оf the gаіnѕ frоm thаt hаvе gone tо thе top. Us military airlifts nonessential staff from embassy in haiti. India vs west indies 2023.