టపాసుల పొగ ఆరోగ్యానికి ప్రమాదమా?

crackers

దీపావళి పండుగ సమయంలో టపాసులు మరియు పటాకులు ఆనందాన్ని పంచుతాయి. అయితే, వీటి వల్ల వచ్చే పొగ మన ఆరోగ్యానికి ప్రమాదకరం. టపాసులు విడుదల చేసే పొగలో సల్ఫర్, నైట్రెయిడ్ వంటి విషపూరక పదార్థాలు ఉంటాయి . ఇవి శరీరానికి హానికరంగా మారవచ్చు. ముఖ్యంగా ఆస్తమా మరియు ఇతర శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి చాలా ప్రమాదకరం.

టపాసులు పేల్చినప్పుడు పొగ బయటకి వస్తుంది. ఇది శ్వాసకోశ సమస్యలు కలిగించవచ్చు. దీని వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, అలెర్జీలు, మరియు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలకు ఈ పొగ ప్రమాదకరం. ఇది ఊపిరిత్తుల లోపాలు, తలనొప్పులు, మరియు చర్మ సమస్యలు కలిగించగలదు.

అందువల్ల ఆరోగ్యానికి హానికరమైన ఈ పొగ నుండి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, ఇల్లు అలంకరించడం,దీపాలు వెలిగించడం, కుటుంబంతో కలిసి సమయాన్ని గడపడం మరియు స్నేహితులతో ఆనందించడం వంటి ఆరోగ్యకరమైన మార్గాలు ఉన్నాయి.. దీపావళి సందర్భంగా ప్రకృతిని కాపాడడం మరియు ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండడం అవసరం. ఆస్తమా ఉన్నవారు ఈ పొగను పీల్చడం వల్ల పరిస్థితి మరింత విషమం అవుతుంది. దాంతో ఈ సమయంలో బయటకి వెళ్లకపోవడం మంచిది. ఎవరైనా బయటకు వెళితే, మాస్క్ ధరించడం మరియు కిటికీలు, తలుపులు మూసి ఉంచడం వల్ల పొగను అరికట్టవచ్చు. అందుకే ఈ పొగ ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందరికీ సురక్షితమైన, ఆనందకరమైన దీపావళి శుభాకాంక్షలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *