తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. సియోల్ పర్యటన అనంతరం రాష్ట్రంలో పలు కీలక రాజకీయ పరిణామాలు జరగబోతాయని, ముఖ్యంగా ధరణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంతో సంబంధించిన అంశాల్లో కీలక అరెస్టులు ఉంటాయని పొంగులేటి ప్రకటించారు. దీపావళి సమయంలో బాంబుల్లా పేలుతాయని, ప్రజల ముందు నిజాలు వెలుగులోకి తెస్తామంటూ ఆయన ప్రకటించిన మాటలు ఇప్పుడు విసిరిన వాగ్దానాల్లా మారాయి.
ఆరు రోజుల తరువాత కూడా రాజకీయాల్లో ఎలాంటి పెద్ద పరిణామాలు జరగకపోవడం, ఎలాంటి అరెస్టులు లేకపోవడంతో, ప్రజలు, రాజకీయ నాయకులు పొంగులేటిపై సెటైర్లు వేస్తున్నారు. ఆయన చెప్పిన మాటలు కేవలం పబ్లిసిటీ కోసమేనా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. బీజేపీ నేతలు కూడా పొంగులేటి వ్యాఖ్యలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఈ ఆరోపణలు నిజమైతే వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ బాంబులు పేలకపోవడంతో, పొంగులేటి చేసిన వ్యాఖ్యలు “తుస్ పటాకా” అయ్యాయని ట్రోల్ చేస్తున్నారు.