రాష్ట్రాభివృద్ధి విషయంలో కాంగ్రెస్ డిజాస్టర్ – కేటీఆర్

ktr power point presentatio

తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం సాంకేతికంగా, అభివృద్ధి పరంగా ముందుకెళ్తున్నప్పటికీ, రాష్ట్ర రాజకీయాలు కొన్ని అంశాల్లో అవస్థలు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన #AskKTR హ్యాష్ ట్యాగ్‌తో ఎక్స్ (ఇతిప్పూర్వపు ట్విట్టర్) వేదికగా నెటిజన్లతో చర్చించారు.

ఒక నెటిజన్ మహారాష్ట్రలో ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీపై అడగగా, ప్రస్తుతం తమ ప్రధాన ఫోకస్ తెలంగాణ అభివృద్ధి మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నెలరోజుల పాటు 144 సెక్షన్ అమలు చేయడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. అంతేకాకుండా, కాంగ్రెస్ పాలన రాష్ట్రాభివృద్ధి విషయంలో విఫలమైందని, ప్రజాసమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ వైఫల్యాన్ని ప్రస్తావించారు.

కేటీఆర్ కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగుతూ విమర్శలు చేయడాన్ని అసహ్యంగా భావిస్తున్నారు. 18 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తన కుటుంబం పలు కష్టాలు ఎదుర్కొందని, ఒక దశలో రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నప్పటికీ ప్రజల కోసం పోరాడాలని తాను నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు.

ఈ వ్యాఖ్యలతో కేటీఆర్ తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టతనిచ్చారు, అలాగే వ్యక్తిగత జీవితం పట్ల తన భావనలను పంచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest sport news. But іѕ іt juѕt an асt ?. Hundreds of pro palestinian demonstrators gathered at kent state university in.