తమిళ స్టార్ హీరో విజయ్ తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించడం తమిళనాడులో రాజకీయంగా పెద్ద సంచలనం రేపుతోంది. విజయ్ తన కొత్త రాజకీయ పార్టీ “తమిళగ వెట్రి కళగం” (టీవీకే) పేరుతో ఏర్పాటుచేశారు. ఇటీవల లక్షలాది మంది అభిమానులు, మద్దతుదారులతో కలిసి ఏర్పాటు చేసిన బహిరంగ సభ ద్వారా తమిళ రాజకీయ రంగంలోకి మూడుగా అడుగుపెట్టారు. అక్టోబరు 27న విక్రవండిలో జరిగిన ఈ సభ విజయ్ రాజకీయ ఆశయాలను వ్యక్తీకరించే వేదికగా నిలిచింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ పరిణామాలపై స్పందిస్తూ, విజయ్ పార్టీ తొలి బహిరంగ సభ విజయవంతమైందని అభినందించారు. దీపావళి సందర్భంగా తన నివాసం ఎదుట రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ విజయ్ ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ఉందని కొనియాడారు.
ఈ సభలో విజయ్ డీఎంకే, బీజేపీ పార్టీలను తమ ప్రత్యర్థులుగా ప్రకటించి, 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇతర పార్టీలతో స్నేహపూర్వక దృక్పథం పాటిస్తామని తెలిపారు.