AP;telangana;అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిస్తే, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.

Telangana Liquor

తెలంగాణ రాష్ట్రం దేశంలో మద్యం అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలుస్తోంది రోజుకు లక్షలాది లీటర్ల మద్యం విక్రయాలు జరుగుతుండగా దక్షిణ భారతదేశంలో మద్యం అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది తరువాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది ఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ (ఎన్ఐపీఎఫ్‌పీ) నివేదిక ప్రకారం గత ఏడాదిలో తెలంగాణలో ఒక్కొక్క వ్యక్తి సగటున రూ.1,623ను మద్యం కోసం ఖర్చు చేశారని ఏపీలో సగటున రూ.1,306 ఖర్చు చేసినట్లు అంచనా వేశారు పంజాబ్‌లో సగటున ఒక్కొక్క వ్యక్తి రూ.1,245 ఖర్చు చేస్తుండగా, ఛత్తీస్‌గఢ్‌లో రూ.1,227గా ఉంది పశ్చిమ బెంగాల్ ఉత్తర ప్రదేశ్ రాజస్థాన్ త్రిపు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ప్రజలు మద్యం కోసం తక్కువగా ఖర్చు చేస్తున్నారు, వాటి సగటు వ్యయాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

తెలంగాణలో ప్రస్తుతం 2,620 మద్యం దుకాణాలు మరియు వెయ్యికి పైగా బార్లు పబ్స్‌ ఉన్నాయి ఇటీవల దసరా సందర్భంగా ఈ రాష్ట్రంలో దాదాపు రూ.1,000 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది సుమారు 11 లక్షల కేసుల మద్యం మరియు 18 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరగడంతో ఈ పండుగ కాలంలో మద్యం అమ్మకాలు రికార్డులు సృష్టించాయి దక్షిణాదిన తెలంగాణలో బీర్ల అమ్మకాలు అత్యధికంగా ఉంటాయని నివేదికలో వెల్లడైంది. ఏప్రిల్ నుండి అక్టోబర్ మధ్య 302.84 లక్షల బీర్ల అమ్మకాలు జరిగినట్లు అంచనా వేయగా, ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంఖ్య 169 లక్షలుగా ఉంది. ఈ భారీ అమ్మకాలు తెలంగాణ రాష్ట్ర ఖజానాకు విశేష ఆదాయాన్ని అందిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

But іѕ іt juѕt an асt ?. Missing sebastian rogers : police say ‘inaccurate’ info has caused ‘distraction’ – mjm news. Latest sport news.