diwali crackers

సైబరాబాద్ పరిధిలో రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే బాణాసంచా కాల్చుకోవాలి – సీపీ

హైదరాబాద్‌లో దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చడంపై ప్రత్యేక ఆంక్షలు విధించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమే టపాకాయలు కాల్చుకోవాలని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ప్రకటించారు. టపాకాయలు కాల్చేటప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్ధేశించిన పరిమితులకు లోబడి ఉండాలని కూడా స్పష్టం చేశారు.

ఈ ఆంక్షలు ఈరోజు నుంచి నవంబర్ 2వ తేదీ వరకు అమల్లో ఉంటాయని చెప్పారు. రాత్రి 8 గంటల ముందు లేదా రాత్రి 10 గంటల తర్వాత బహిరంగ ప్రదేశాల్లో లేదా పబ్లిక్ రోడ్లపై బాణసంచా కాలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీపావళిని సురక్షితంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pjs pemerhati jurnalis siber. Read more about facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Swiftsportx | to help you to predict better.