లక్ష్మీదేవి బొమ్మ ఉన్న టపాసులు కాల్చవద్దని ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి

laxmi bomb

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దీపావళి పండుగ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. లక్ష్మీదేవి బొమ్మ ఉన్న టపాకాయలు (క్రాకర్స్) కాల్చరాదని, ఎందుకంటే దీపావళి అనేది లక్ష్మీదేవిని పూజించే పండుగ అని, ఆ దేవిని ప్రతిబింబించే బొమ్మను పేల్చడం తగదని అన్నారు. దీన్ని ఒక పెద్ద కుట్రగా ఆయన అభివర్ణించారు, దీనిని ఇప్పటికీ చాలా మంది గమనించలేదని పేర్కొన్నారు.

అంతేకాక, టపాకాయలు కాల్చేటప్పుడు భద్రతా చర్యలు పాటించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. పిల్లలు టపాకాయలు కాల్చేటప్పుడు పెద్దవాళ్లు పక్కన ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు, ఎందుకంటే పిల్లలకు కొన్ని టపాకాయలలోని మందుల గురించి తెలియదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest sport news. But іѕ іt juѕt an асt ?. Uk’s cameron discussed ukraine russia peace deal with trump : report – mjm news.