Untitled 2

అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్..?

అనకాపల్లి (D) నక్కపల్లి (Anakapalle ) వద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ (Integrated Steel Plant) ఏర్పాటుకు ఆర్సెలార్ మిట్టల్ మరియు నిప్పన్ కంపెనీలు (ArcelorMittal and Nippon Companies) ఆసక్తి చూపుతున్నాయి. మొదటి దశలో రూ.70,000 కోట్ల పెట్టుబడిని ప్రభుత్వం కు ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ప్లాంట్ కోసం 2,000 ఎకరాల స్థలాన్ని అవసరమని, 2029 నాటికి ఉత్పత్తిని ప్రారంభించే యోచనలో ఉన్నామని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్లాంట్ ప్రారంభమైతే 20,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని అంచనా వేస్తుంది.

ప్రాజెక్ట్ వివరాలు:

నిర్మాణం & ఉత్పత్తి:

మొదటి దశలో, 2029 జనవరుకు ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు తెలిపింది.
ప్లాంట్‌ వార్షిక 7.3 మిలియన్‌ మెట్రిక్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండనుంది.

ఉపాధి అవకాశాలు:

నిర్మాణ సమయంలో సుమారు 25,000 మందికి ఉపాధి కల్పించబడుతుంది. తదుపరి కార్యకలాపాలు మరియు నిర్వహణ కోసం సుమారు 20,000 మందికి ఉపాధి లభిస్తుంది.

ఇతర నిర్మాణాలు:

ప్లాంట్‌ క్షేత్రంలో పోర్టు, రైల్‌ యార్డు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని కోరింది. టౌన్‌షిప్ అభివృద్ధి కోసం 440 ఎకరాలను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది.

రెండో దశ:

రెండో దశలో 10.5 మిలియన్‌ మెట్రిక్‌ ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ నిర్మాణానికి మరింత 3,800 ఎకరాలను కేటాయించాలని ప్రణాళిక ఉంది.

భూసేకరణ:

అనకాపల్లి బల్క్‌డ్రగ్ పార్కుకు ప్రతిపాదించిన 2,200 ఎకరాలను మొదటి దశ ప్లాంట్‌ నిర్మాణానికి వినియోగించే అవకాశం ఉంది. తద్వారా నిర్మాణ పనులు త్వరగా ప్రారంభం కావచ్చు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి సంబంధించిన చర్చలు ఇప్పటికే పలు దఫాలుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి మరియు యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి ముఖ్యమైన ప్రాజెక్టుగా భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rapat paripurna dprd kota batam, pemerintah kota batam ajukan 8 poin ranperda. Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Latest sport news.