తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 6 నుండి కులగణనను ప్రారంభించాలని నిర్ణయించడం ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించి, ఆయన చేత ప్రారంభింపజేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది.
కులగణనపై అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం త్వరలోనే అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. కులగణన ద్వారా ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై స్పష్టత లభిస్తుందని, అందుకు అనుగుణంగా రానున్న రోజుల్లో అవసరమైన పథకాలు, సౌకర్యాలు అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.