రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌పై పోలీసులకు మరో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు సంబంధించి మే 13న శ్రీకాకుళం జిల్లా గార పోలీస్ స్టేషన్‌లో మాజీ ఎంపీటీసీ గోర సురేష్ ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుతో అనిల్‌పై ఐపీసీ సెక్షన్లు 504, 506, 509 కింద కేసు నమోదైంది. అనంతరం అనిల్‌ను అదుపులోకి తీసుకుని శ్రీకాకుళం జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా, జడ్జి అతనికి నవంబర్ 5 వరకు రిమాండ్ విధించారు. ప్రస్తుతం అనిల్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.