ఏపీలో దీపం 2 పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ 1న శ్రీకారం చుడతారని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. బుధవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మంత్రి మాట్లాడుతూ, అక్టోబర్ 29న ఉదయం 10 గంటల నుండే ఉచిత గ్యాస్ బుకింగ్‌లు ప్రారంభమైందని తెలిపారు. ఆ రోజు ఒక్క రోజులోనే 4 లక్షలకు పైగా బుకింగ్‌లు జరిగాయని, రోజుకు 2.5 లక్షల బుకింగ్‌లను డెలివరీ చేయగలుగుతున్నట్లు ఆయిల్ కంపెనీలు పేర్కొన్నాయని చెప్పారు.
నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఉచిత గ్యాస్‌ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్దిదారులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే, ఈరోజు ఆయిల్ కంపెనీలకు ముఖ్యమంత్రి అడ్వాన్స్ పేమెంట్ మొత్తాన్ని చెక్కు రూపంలో అందించినట్లు వెల్లడించారు.