ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ‘జై హనుమాన్’ సినిమాఫై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ లో కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేయడమే కాదు.. ఫస్ట్ లుక్ పోస్టర్ ను దీపావళి సందర్భంగా విడుదల చేసారు. ఈ పోస్టర్ తో సినిమా ఫై అంచనాలు మరింత పెరిగాయి. పోస్టర్‌లో రిషబ్ శెట్టి పవర్‌ఫుల్ పోజ్‌లో భక్తితో శ్రీరాముని విగ్రహాన్ని పట్టుకుని ఉన్న తీరు, ఆయన కళ్లలో కనిపిస్తున్న భావోద్వేగం పాత్రలో ఆత్మార్థతను, లోతైన భక్తిని ప్రతిబింబిస్తోంది.