tg govt

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం దీపావళి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించింది. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను 3.64 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెరిగిన డీఏ 2022 జులై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. నవంబర్ జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు చేస్తారు. 2022 జులై 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు ఉన్న డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నారు.

2024 మార్చి 31నాటికి పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులకు ఈ డీఏ బకాయిలను 17 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. సీపీఎస్ ఉద్యోగుల విషయానికి వస్తే, డీఏ బకాయిల్లో 10 శాతం ప్రాన్ ఖాతాకు జమ చేసి, మిగిలిన 90 శాతాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి 17 వాయిదాల్లో చెల్లిస్తారు. రిటైర్డ్ ఉద్యోగులకు డీఏ బకాయిలను 2025 జనవరి నుంచి 17 వాయిదాల్లో చెల్లిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bahas 2 agenda penting, pjs wali kota batam hadiri rapat paripurna dprd kota batam. But іѕ іt juѕt an асt ?. India vs west indies 2023 archives | swiftsportx.