Janwada farmhouse case. Raj Pakala to police investigation

జ‌న్వాడ ఫామ్ హౌస్ కేసు.. పోలీసుల విచారణకు రాజ్‌పాకల

హైదరాబాద్‌: జ‌న్వాడ ఫామ్ హౌస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఈరోజు మోకిల పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఆయన తన న్యాయవాదితో కలిసి విచారణకు వచ్చినట్లు సమాచారం. ఇటీవ‌ల, పోలీసులు పార్టీ కేసుకు సంబంధించి ఆయనకు నోటీసులు అందించారు.

జ‌న్వాడలోని రిజర్వ్ కాలనీలోని తన ఫామ్‌హౌస్‌లో రాజ్ పాకాల శనివారం రాత్రి పార్టీ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ వేడుక పెద్ద శబ్దాలతో జరిగిందని సమాచారం అందడంతో పోలీసులు ఫామ్‌హౌస్‌కు చేరుకుని సోదాలు చేపట్టారు.

ఆ సమయంలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 35 మందితో మద్యం పార్టీ నిర్వహించారు. దీంతో పోలీసులు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలలో రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు రాజ్ పాకాల నేడు విచారణకు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Kejar pertumbuhan ekonomi 8 persen, bp batam prioritaskan pengembangan kawasan strategis. Ground incursion in the israel hamas war. Latest sport news.