మంత్రి కొండా సురేఖపై పెట్టిన పరువునష్టం దావాపై కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణను నవంబర్ 13కు వాయిదా వేయడం జరిగింది. నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో, ఇన్ఛార్జి జడ్జి విచారణ తేదీని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే, నాగ చైతన్య-సమంత విడాకులపై వ్యాఖ్యలు చేస్తూ, కేటీఆర్ పేరు ప్రస్తావించడమే తన పరువుకు నష్టం కలిగించిందని కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ పరువునష్టం దావా వేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వివాదం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసు రాష్ట్ర రాజకీయాల్లో మరింత హిట్ పెరిగేలా చేసింది.